ఎస్పీ బాలు ఆరోగ్యం విషమిస్తోంది: గురువారం హెల్త్ బులిటెన్ విడుదల

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి మరింత విషమిస్తోంది. గురువారం ఉదయం చెన్నై ఎంజీఎం హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ఐసీయూలో ఎక్మో సపోర్ట్‌తో బాలు పోరాడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ‘‘బాలు ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది.ఐసీయూలో ఎక్మో సపోర్ట్‌తో పోరాడుతున్నట్లు వైద్యులు తెలిపారు. బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు ఇటు సామాన్య జనం సైతం కోరుతున్నారు.

ఆగస్ట్ 5వ తేదీన తనకు కరోనా సోకిందని ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలియజేస్తూ ఆయన ఓ వీడియోను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విడుదల చేసిన విషయం తెలిసిందే. జలుబు, జ్వరం తప్ప తన ఆరోగ్యం బాగానే ఉందని ఎవరూ కంగారు పడొద్దని సూచించారు. వైద్యులు తనను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండమని సూచించారని కానీ తన కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుందని తాను ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. తన స్నేహితులంతా ఆసుపత్రిలోనే ఉన్నారని.. తనను జాగ్రత్తగా చూసుకుంటున్నారని వెల్లడించారు.

కాగా బాలుపై విపరీతమైన బెంగతో ఆయన వీరాభిమాని హరీంద్రబాబు హఠాన్మరణం పాలయ్యారు. ‘పాడుతా తీయగా’ ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ ఎపిసోడ్‌లో ఆయన ఆడియన్స్‌లో కూర్చుని ప్రతీ పాట ఆస్వాదించేవారు సినిమా పాటలపై విపరీతమైన పరిజ్ఞానం, విపరీతమైన ఇష్టం. పాడుతా తీయగా ఆడియన్స్‌లో కూర్చున్న హరీంద్రబాబుని ఆసక్తిని గమనించిన బాలు ఒకసారి స్వయంగా అదే వేదికమీదకు పిలిచి సన్మానించారు. ప్రస్తుతం బాలు పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలుసుకుని తీవ్ర బెంగతో హరీంద్రబాబు కన్నుమూశారు.