లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ అందుకున్న యస్ పి బాల సుబ్రమణ్యం

  • IndiaGlitz, [Tuesday,December 04 2018]

ప్రముఖ గాయకులు శ్రీ యస్ పి బాల సుబ్రమణ్యం గారికి ప్రతిష్టాత్మక లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ని ఇండీవుడ్ సంస్థ హైదరాబాద్ లోని హైటెక్స్ ప్రాంగణంలో అంద జేయడం జరిగింది.

ఇండీవుడ్ జ్యూరీ మరియు అడ్వైజరీ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ,ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వచ్చిన ఎంతో మంది అతిథులు,సినీ ప్రముఖులు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గాన గంధర్వుడు శ్రీ బాల సుబ్రమణ్యం గారికి ఈ పురస్కారాన్ని అంద జేయడం తమ సంస్థ కు లభించిన గౌరవం గా అభివర్ణించారు.

శ్రీ బాల సుబ్రమణ్యం గారు మాట్లాడుతూ,ఈ అవార్డ్ అందుకోవడం ఎంతో అనందాన్ని కలగ చేస్తుందని,సంగీత ప్రపంచానికి ఈ అవార్డ్ అంకితమని ,ఎంతో మంది నూతన టాలెంట్ ని ప్రోత్సహిస్తున్న ఇండీవుడ్ చైర్మన్ శ్రీ సోహన్ రాయ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియ జేసారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారుడు శ్రీ శివమణి మరియు స్టెఫెన్ దెవసి లను ప్రత్యేకంగా సన్మానించారు.