నిర్మలమ్మకు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ థ్యాంక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బృందం కలిసింది. సోమవారం నాడు ఢిల్లీ వేదికగా ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు విషయాలను నిర్మలమ్మతో బృందం నిశితంగా చర్చించింది. అనంతరం ఈ భేటీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ‘నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు. మా మెమోరాండం సమర్పించడానికి అవకాశం ఇచ్చినందుకు.. మా సమర్పణ మరియు పంపిణీదారుల వాటా, నిర్మాతల వాటాపై విధించే టీడీఎస్ శాతం సమస్యలను ఓపికగా విన్నారు. కొన్ని కీలకమైన సమస్యలు ఉన్నాయని గౌరవ మంత్రి అర్థం చేసుకున్నారు. వాటిని పరిష్కార విషయంలో చిత్ర పరిశ్రమతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు’ అని ప్రెసిడెంట్ కాట్రగడ్డ ప్రసాద్ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా ఈ భేటీలో సీనియర్ నటి, ఎంపీ సుమలత, ఎంపీ ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాలు, గనుల మరియు బొగ్గు శాఖ మంత్రి, ఎంపీ రఘురామకృష్ణరాజు, కాట్రగడ్డ ప్రసాద్, రవి కొట్టారాకర, డీ.ఆర్. జైరాజ్, ఘట్టమనేని ఆది శేషగిరి రావుతో పలువురు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout