సౌతిండియా కింగ్ సూపర్ స్టార్ మహేశ్..!

  • IndiaGlitz, [Saturday,March 07 2020]

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా.. ఆయన ఎంచుకునే సినిమాలు, అభిమానుల ఫాలోయింగ్ గురించి అయితే అస్సలే చెప్పనక్కర్లేదు. మహేశ్ సినిమా రిలీజ్ అవుతోందంటే బాక్సాఫీస్ బద్ధలవ్వాల్సిందే. ఈయన సినిమాలు రిలీజ్ టైమ్‌లో ఎన్ని చిత్రాలొచ్చిన సదరు అభిమాని లేదా సినిప్రియుడి ఛాయిస్ మొదట మహేశ్ సినిమానే.. ఎందుకంటే ఆయన క్రేజ్ అలాంటిది మరి. ఒక్క మాటలో చెప్పాలంటే మహేశ్ తోపు అంతే..!. తెలుగు సినిమాను ఊహించనంత ఎత్తుకు తీసుకెళ్తున్న హీరోల్లో సూపర్‌స్టార్ మహేష్ బాబుది చాలా ప్రత్యేక స్థానమని అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు.

కింగ్.. మహేశ్..!
ఒక్క సినిమా విషయంలోనే కాదండోయ్.. ఇప్పుడు మహేశ్ సౌతిండియాలో కింగ్. ఎలాగంటే.. ఇంతవరకూ మహేశ్ బాబు 22 బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. థమ్సప్, సంతూర్, శ్రీ సూర్య డెవలపర్స్, రాయల్ స్టాగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్. ఇలా చాలా వరకు సౌత్‌లో యాడ్ చేయాలంటే మొదట సదరు కంపెనీ యాజమాన్యం మహేశ్‌నే ఎంచుకుంటోంది. వాణిజ్య విశ్లేషకులు, బ్రాండెడ్ కంపెనీలు మొదటి చాయిస్‌ మహేశ్ బాబే. అటు సినిమాలతో.. ఇటు ప్రకటనలతో బిజిబిజీగా మహేశ్ గడిపేస్తున్నాడు. సో.. సినిమాల్లోనే కాదు.. ప్రకటనల్లోనూ మహేశ్ బాబే కింగ్ అన్న మాట.

మహేశ్‌కు మంచి ఫాలోయింగ్.. వివాదాలకు దూరంగా ఉంటారు. అందుకే మహేశే మొదటి చాయిస్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ అయితే 22 బ్రాండ్స్‌కు.. మున్ముంథు లెక్కలేనన్ని ప్రకటనలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదేమో.

More News

ఈ ట్వీట్‌కు అర్థమేంటి రష్మిక మందన్నా..!?

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక మందన్నా ఇప్పుడు స్టార్ హీరోయిన్లలో ఒకరుగా ఓ వెలుగు వెలుగుతోంది.

కేటీఆర్ సార్.. న్యాయం చేయండి : రాహుల్ సిప్లిగంజ్

తెలుగు బిగ్‌బాస్-3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో కొందరు వ్యక్తులు బీరు బాటిళ్లతో దాడి చేసిన విషయం విదితమే.

జూనియర్ ఆర్టిస్ట్‌ను వేధించిన లారెన్స్ తమ్ముడు!

ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ రాఘవ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

‘ఎస్ బ్యాంక్’ ఖాతాదారులకు నిర్మలమ్మ అభయం!

ప్రముఖ ‘ఎస్ బ్యాంక్’ నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది.!. ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో  కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మాస్క్‌లు తయారీ కోసం ఉపాసన వీడియో చూడండి!

కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.