ముందు నో చెప్పినా....అందుకే ఓం నమో వేంకటేశాయలో నటించాను - సౌరభ్ జైన్
Send us your feedback to audioarticles@vaarta.com
నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందిన నాలుగవ భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.ఈ చిత్రాన్ని సాయికృపా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై మహేష్ రెడ్డి నిర్మించారు. హధీరామ్ బాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.
ఈ చిత్రంలో నాగార్జున హధీరామ్ బాబాగా నటిస్తే...శ్రీ వెంకటేశ్వర స్వామిగా సౌరభ్ జైన్ నటించారు. ఫిబ్రవరి 10న ఓం నమో వేంకటేశాయ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా వెంకటేశ్వరస్వామి పాత్రధారి సౌరభ్ జైన్ తో ఇంటర్ వ్యూ మీ కోసం...!
మీ గురించి చెప్పండి..?
స్టార్ ప్లస్ లో ప్రసారం అయిన మహా భారతం సీరియల్ లో శ్రీకృష్ణుడుగా, విష్ణుగా నటించాను. అలాగే జై శ్రీకృష్ణ, మహాపురాణ్ తదితర సీరియల్స్ లో నటించాను. అలాగే కొన్ని సీరియల్స్ లో నెగిటివ్ రోల్ కూడా చేసాను.
ఇంకా మీరు ఏఏ క్యారెక్టర్స్ చేసారు..?
బాలాజీ టెలీ ఫిల్మ్స్ లో కామెడీ రోల్స్ చేసాను. హజీర్ జవబ్ బీర్బల్ సీరియల్ లో అక్బర్ రోల్ చేసాను. అలాగే కొన్ని నెగిటివ్ రోల్స్ కూడా చేసాను. నాకు ఏక్టింగ్ అంటే ఇష్టం. డిఫరెంట్ రోల్స్ చేయాలి అనుకుంటున్నాను.
ఇంతకీ ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది..?
నేను మైథిలాజికల్ క్యారెక్టర్స్ చేసి ఉండడం వలన ఇక జోనర్ మార్చాలి అనుకున్నాను. అందుచేత ఈ సినిమాలో నటిస్తారా అని నాకు ఫోన్ చేసినప్పుడు నో అని చెప్పాను. అయితే...హైదరాబాద్ వచ్చి నాగ్ సార్, రాఘవేంద్రరావు గారు, జె.కె.భారవి గారిని కలిసాను. హధీరామ్ బాబా స్టోరీ చెప్పారు. చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇది చాలా మంచి అవకాశం అనిపించి వెంటనే ఓకే చెప్పాను.
నాగార్జున, రాఘవేంద్రరావులతో వర్క్ చేయాలి అని ఈ సినిమాలో నటించారా..? లేక మీ క్యారెక్టర్ నచ్చి చేసారా..?
నాగార్జున, రాఘవేంద్రరావులు లెజెండ్స్. ఇలాంటి లెజెండ్స్ తో వర్క్ చేసే అవకాశం లైఫ్ లో ఒకసారే వస్తుంది. ఇది రాఘవేంద్రరావు గారి 108వ సినిమా. ఇలాంటి గ్రేట్ డైరెక్టర్ తో వర్క్ చేసే అవకాశం రావడం చాలా హ్యాపీ. అందుకనే ఈ సినిమాలో నటించాను. హధీరామ్ బాబా స్టోరీ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించడంతో వేరే ఆలోచన లేకుండా ఓకే చెప్పాను.
నాగార్జున నటించిన సినిమాలు ఏమైనా చూసారా..?
శివ, ఖుదాగవా సినిమాలు చూసాను. తెలుగు సినిమాలు హిందీలో డబ్ అవుతుంటాయి. అలా హిందీలో అనువదించిన తెలుగు సినిమాలన్నీ దాదాపు చూసాను.
శ్రీకృష్ణుడు, విష్ణుగా నటించారు కదా...! వెంకటేశ్వరస్వామిగా ఈ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది..?
ఈ పాత్ర పోషించడం నాకు చాలా ఇంట్రస్టింగ్ గా.. కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఈ చిత్రంలో వెంకటేశ్వరస్వామి, హధీరామ్ బాబా ఇద్దరూ ఫ్రెండ్స్ లా ఉంటారు. అందుచేత ఈ క్యారెక్టర్ నాకు చాలా కొత్తగా ఉంది. ఈ క్యారెక్టర్లో డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్, డిఫరెంట్ ఎమోషన్స్ చూపించడానికి అవకాశం ఉంది.
నాగార్జునతో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
నాగ్ సార్ లెజెండ్. టాప్ స్టార్ నాగ్ సార్ ని ఫస్ట్ కలిసినప్పుడు ఎలా ఉంటారో ఎలా రియాక్ట్ అవుతారో అనుకున్నాను. కలిసినప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. షూటింగ్ టైమ్ లో కూడా చాలా సరదాగా మాట్లాడేవారు. ఇక్కడ కింగ్ అని పిలుస్తారు కదా..! అంత పెద్ద స్టార్ అలా ఉండడం నిజంగా గ్రేట్. అప్పటి వరకు నార్మల్ గా ఉంటారు కెమెరా ఆన్ చేయగానే హధీరామ్ బాబా అయిపోతారు. అలా అవ్వడం నిజంగా గ్రేట్. నాగ్ సార్ ని చూసి చాలా నేర్చుకున్నాను.
తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారా..?
ఫస్ట్ నాగ్ సార్, రాఘవేంద్రరావు గారితో కలిసి వెళ్లాను. వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఆతర్వాత రెండోసారి మా అమ్మతో కలిసి వెళ్లాను.
అనుష్క పాత్ర ఎలా ఉంటుంది. ఆమెతో నటించడం గురించి..?
అనుష్క భక్తురాలు పాత్ర పోషించారు. అద్భుతంగా నటించారు.
ఈ పాత్ర కోసం హామ్ వర్క్ ఏమైనా చేసారా..?
నేను హామ్ వర్క్ ఏమీ చేయలేదు రాఘవేంద్రరావు గారు ఏం చెబితే అది చేసాను. రాఘవేంద్రరావు గార్ని ఫాలో అయిపోయాను అంతే..!
మీరు జైన్ అయినా భౌద్దమతాన్ని నమ్ముతారా..?
బౌద్దమతమే కాదు అన్ని మతాలను నమ్ముతాను. శ్రీకృష్ణుడి పాత్ర పోషించినప్పుడు చాలా తెలుసుకున్నాను. చర్చికి కూడా వెళతాను. అందుచేత అన్ని మతాలను విశ్వసిస్తాను.
హైదరాబాద్ ఎలా ఉంది..?
హైదరాబాద్ చాలా బాగుంది. బ్యూటీఫుల్ ప్లేస్ కె.బి.ఆర్ పార్క్ కి వెళ్లాను.
రాఘవేంద్రరావు గారితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..?
శ్రీదేవి, జితేంద్ర గారితో వర్క్ చేసిన డైరెక్టర్ ఆయన. ఇది రాఘవేంద్రరావు గారి 108వ సినిమా. ఇలాంటి అవకాశం లైఫ్ లో ఒకసారే వస్తుంది. చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. అందుచేత లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారితో వర్క్ చేయడం ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి.
ఓం నమో వెంకటేశాయ ఆడియోకు విశేష స్పందన లభిస్తుంది. కీరవాణి మ్యూజిక్ గురించి మీరు ఏం చెబుతారు..?
ఆడియో ఆల్రెడీ సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. కీరవాణి సార్ మ్యూజిక్ ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు.
నిర్మాత మహేష్ రెడ్డి గురిం ఏం చెబుతారు..?
సాయికృపా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఇంతకు ముందు శిరిడి సాయి సినిమాని నిర్మించారు. ఆయన ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో సినిమాని నిర్మించారు. చాలా పవిత్రంగా వీలైనంత ఎక్కువు మందికి చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని నిర్మించారు. షూటింగ్ సెట్ లో కూడా గోవింద గోవింద అనే నామస్మరణతోనే అందరూ వర్క్ చేసారు.
నెగిటివ్ రోల్స్ చేయాలనుకుంటున్నారా..?
నాకు ఏక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకని నెగిటివ్స్ రోల్స్ మాత్రేమే కాదు ఎలాంటి రోల్స్ చేయడానికైనా రెడీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments