సౌఖ్యం మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
నటీనటులు: గోపీచంద్, రెజీనా, షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, జీవా, రఘుబాబు, కృష్ణభగవాన్, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, రఘు, శివాజీరాజా, సురేఖావాణి, సత్యకృష్ణ, సత్యం రాజేష్ తదితరులు
కథ, మాటలు: శ్రీధర్ సీపాన,
సంగీతం: అనూప్ రూబెన్స్,
స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్,
కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ,
ఎడిటర్: గౌతంరాజు,
ఆర్ట్ : వివేక్,
సంస్థ: భవ్య క్రియేషన్స్
నిర్మాత: వి.ఆనంద్‌ప్రసాద్.
దర్శకత్వం: ఎ.యస్.రవికుమార్ చౌదరి
సౌఖ్యం అనే మాటను వింటుంటే మనసుకు సుఖంగా ఉంటుంది. అహర్నిశలూ వ్యక్తి పాటుపడేది సౌఖ్యంగా జీవించడానికే. కుటుంబం సౌఖ్యంగా ఉండాలి. కుటుంబంతో పాటు ఇరుగూపొరుగూ కూడా సౌఖ్యంగా ఉండాలనుకునే హీరో కేరక్టరైజేషన్‌తో అల్లుకున్న కథే `సౌఖ్యం` అని చిత్ర యూనిట్ పలు సందర్భాల్లో చెప్పింది. `యజ్ఞం` తర్వాత గోపీచంద్, రవికుమార్ చౌదరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. లౌక్యం తర్వాత భవ్య క్రియేషన్స్ గోపీచంద్‌ను హీరోగా పెట్టి చేసిన సినిమా. యజ్ఞం అంత పవర్‌ఫుల్‌గా ఉందా? లౌక్యంలాగా ఎంటర్టైనింగ్గా ఉందా? అనేది తెలుసుకోవాలంటే చదివేయండి.
కథ
హైదరాబాద్ లోని రాజారావు(ముఖేష్ రుషి) కొడుకు శ్రీనివాసులు(గోపీచంద్) తిరుపతిలోని తన అక్క, బావ(సురేఖావాణి, శివాజీరాజా)లను చూడటానికి ట్రెయిన్ లో వెళుతుంటే . కలకత్తాలో పేరు మోసిన డాన్ పి.ఆర్(దేవన్) కూతురైన శైలజ(రెజీనా) పరిచయం ఇష్టం లేని పెళ్ళి చేస్తుండటంతో పారిపోతూ అదే ట్రెయిన్ లో తిరుపతికి బయలుదేరుతుంది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడినా శ్రీను మాత్రమే తన ప్రేమను చెబుతాడు. పి.ఆర్ తన కూతురిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి ముఖ్యమంత్రి కొడుకుతో పెళ్ళి చేద్దామనుకుంటే శ్రీను వెళ్ళి ఆమెను అక్కడ నుండి తప్పించి తన ఇంటికి తీసుకొస్తాడు. తన తండ్రి రాజారావు దగ్గర శైలజకు మంచి మార్కులేయించడానికి అందరూ ప్రయత్నిస్తారు. అంతలోనే మళ్ళీ పి.ఆర్ రావడం, అతన్నుండి. శైలజను హైదరాబాద్ డాన్(ప్రదీప్ రావత్) తీసుకెళ్ళి తన కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలనుకోవడంతో శ్రీను ఏం చేస్తాడనేదే కథ.
ప్లస్ పాయింట్స్
సినిమాను కామెడి , పేరడీలను బేస్ చేసుకుని తీశారు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో పోసాని కృష్ణమురళి కామెడి నవ్విస్తుంది. జయప్రకాష్ రెడ్డి ముసలి పెళ్ళి కొడుకులా తన వంతుగా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక సెకండాప్ విషయానికి వస్తే పృథ్వీ బాహుబలి స్పూఫ్, శ్రీమంతుడు స్పూఫ్ ధీమంతుడు నవ్వించాయి. గోపీచంద్ ఫైట్స్, డ్యాన్సుల విషయంలో పడ్డ కష్టం కనపడుతుంది. రెజీనా లుక్స్ పరంగా బాగానే ఉంది.
మైనస్ పాయింట్స్
తన స్వంత కథను నమ్మి సినిమా తీసే దర్శకుడు ఎ.యస్.రవికుమార్ చౌదరి ఈసారి శ్రీధర్ సీపాన కథ, కోనవెంకట్, గోపిమోహన్ ల స్క్రీన్ ప్లేను నమ్ముకుని రంగంలో దిగాడు. ప్రేక్షకులు రవికుమార్ గత చిత్రం పిల్లా నువ్వులేని జీవితంను బాగానే హ్యండిల్ చేయడంతో ఈ సినిమాను కూడా బాగానే చేశాడని అనుకుంటారు. కానీ ఎక్కడో మిస్ ఫైర్ అయింది. కథ సినిమాలో మెయిన్ డ్రాబ్యాక్ అయింది. కోనవెంటక్ అండ్ టీం తమ పాత ఫార్ములానే మరోసారి రుద్దడానికి ప్రయత్నించారు. ఒకే వైద్యం అన్నీ జబ్బులకు పనిచేయదనే సామెత మనమెరుగుదుం. అలాగే ఈ ఓకే స్టయిల్ ఆప్ పార్ములా అన్నీ సార్లు సక్సెస్ కాదనే విషయాన్ని వీరు బొత్తిగా మరచిపోయారు. వీరు ఇంకా తమ పంతా మార్చుకోకుంటే వీరి సినిమా చూడాలంటేనే ప్రేక్షకులు ఇక జంకే స్థితికి చేరుకుంటారనేది ఖాయం. అనూప్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తన సినిమాలో ట్యూన్స్ ను తనే కాపీ కొట్టుకున్నాడు సరే, వినేవారు కనిపెట్టలేడనుకున్నాడేమో కానీ ప్రేక్షకులు ఒకప్పటిలా లేరు.
విశ్లేషణ
మేం మారం మేం తీసేది మీరు చూడాల్సిందే అనే తీరులో సినిమాలు తయారవడమంటే ఇదేనేమో. ఎందుకంటే కొత్తగా ప్రయత్నించి ఉంటే సరేలే అనుకోవచ్చు కాన ఇదే టీం గతంలో తీసిన లౌక్యం సినిమానే పేరు, హీరోయిన్ ను మార్చి తీసిన విధంగా ఉంది. క్లయిమాక్స్ లో వచ్చే బ్రహ్మి చెవిడి కామెడి ఓ వైపు రవితేజ బలుపు సినిమాను, మరోవైపు గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ కామెడి పార్ట్ ను గుర్తుకు తెస్తుంది. యజ్జం, పిల్లానువ్వులేని జీవితం వంటి సిమాలను డైరెక్ట్ చేసిన రవికుమార్ చౌదరి ఈ కథను ఎలా ఓకే చేశాడు. లౌక్యం హిట్ అయింది కదా సౌఖ్యం చూడరా అని అనుకున్నారు. సక్సెస్ ఫార్ములా అంటే తీసిన కథను మళ్ళీ తీయడం కాదు. కొత్త విదానంలో ప్రెజెంటేషన్ చేసుంటే బావుండేది. ప్రతి సీన్ ఏదో వేరే సినిమాలో నుండి కాపీ కొట్టినట్టుగానే కనపడటం శోచనీయం.
బాటమ్ లైన్
మొత్తం మీద సౌఖ్యం` మనసుకు భారం అవుతుంది
రేటింగ్: 1.5/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments