'సౌఖ్యం' టీజర్ రెడీ..
Send us your feedback to audioarticles@vaarta.com
గోపీచంద్, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం సౌఖ్యం. ఈ చిత్రాన్ని పిల్లా నువ్వులేని జీవితంతో ఇటీవల విజయం సాధించిన ఎ.ఎస్.రవికుమార్ తెరకెక్కిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.ఈనెల 13న అంగరంగ వైభవంగా సౌఖ్యం ఆడియోను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సౌఖ్యం మూవీ రిలీజ్ చేస్తున్నారు.
అయితే అసలు సౌఖ్యం ఎలా ఉంటుందో ఆడియోన్స్ కు తెలియచేసేందుకు ఈరోజు సాయంత్రం టీజర్ రిలీజ్ చేయనున్నారట. గోపీచంద్, ఎ.ఎస్.రవికుమార్ ల స్టైల్ యాక్షన్ ఉంటూనే, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ తో సౌఖ్యం రూపొందించారట. సౌఖ్యం సక్సెస్ పై చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో ఉన్నారు. మరి సౌఖ్యం ఏరేంజ్ సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 25 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments