'సౌఖ్యం' పాటలు విడుదల

  • IndiaGlitz, [Monday,December 14 2015]

భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గోపీచంద్‌, రెజీనా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం సౌఖ్యం. ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌కుడు. వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మాత‌. అనూప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆఢియో విడుద‌ల కార్యక్ర‌మాన్ని ఒంగోలు చిత్ర‌యూనిట్ నిర్వ‌హించారు. బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను గోపీచంద్ విడుద‌ల చేశారు.

ముత్యాల సుబ్బ‌య్య సినిమాల్లోకి రావాల‌ని ఎంతో ఎంక‌రేజ్ చేశారు. ఎం.నాగేశ్వ‌ర‌రావు, చ‌ప్పిడి హ‌నుమంత‌రావు, తిరుప‌తిరావు తొలి సినిమాను నిర్మించ‌డం వ‌ల్ల‌నే ఈరోజు హీరోగా నిల‌బ‌డి ఉన్నాను. భవ్య‌క్రియేష‌న్స్‌తో సినిమా చేస్తున్న‌ప్పుడు చాలా ఫ్రీడం ఉంటుంది. యజ్ఞం త‌ర్వాత ర‌వికుమార్ చౌద‌రిగారితో చేస్తున్న సినిమా. అనూప్ మ్యూజిక్ ఇచ్చారు. ప్ర‌సాద్ మూరెళ్ళ ఎక్స‌లెంట్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. రెజీనా బాగా క‌ష్ట‌ప‌డుతుంది. పెద్ద హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటుంది. లౌక్యం కంటే మంచి హిట్ ఇవ్వాల‌ని సౌఖ్యం వంటి మంచి క‌థ‌ను అందించారు. పృథ్వీ ఈ సినిమాలో బాహుబ‌లిగా క‌న‌ప‌డ‌తాడు. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్ అని హీరో గోపీచంద్ అన్నారు.

పిల్లా నువ్వులేని జీవితం త‌ర్వాత ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రిగారు, అనూప్‌గారితో చేస్తున్న రెండోసినిమా. అనూప్‌గారు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. గోపీచంద్ హార్డ్ వ‌ర్కింగ్ హీరో. నా పుట్టిన‌రోజు ఒంగోలులో సెల‌బ్రేట్ చేసుకున్నందుకు ఆనందంగా ఉందని రెజీనా అన్నారు.

నాకు ద‌ర్శ‌కుడుగా అవ‌కాశం ఇచ్చిన నిర్మాత పోకూరి బాబూరావు, హీరో గోపీచంద్ ఒంగోలుకు చెందిన‌వారే. శ్రీధ‌ర్ సీపాన మంచి స్క్రిప్ట్ అందించారు. న‌మ్మ‌కంతో రండి, ఆనందంతో వెళ్లండి. సౌఖ్యం సినిమా అంతా ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటుందని ద‌ర్శ‌కుడు ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి అన్నారు.

సినిమాలనే కాదు ఆడియో వేడుక‌లు,స‌క్సెస్‌మీట్‌ల‌ను కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకురావాల‌నే ఉద్దేశంతోనే సౌఖ్యం ఆడియో విడుదల కార్య‌క్ర‌మాన్ని ఒంగోలు నిర్వ‌హిస్తున్నామ‌ని నిర్మాత భ‌వ్య ఆనంద్ ప్ర‌సాద్ తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, అనూప్‌, శ్రీధ‌ర్ సీపాన‌, ర‌ఘుబాబు, ప్ర‌సాద్ మూరెళ్ళ‌, గౌతంరాజు, శివాజీ రాజా, సుద‌ర్శ‌న్‌, శంక‌ర్ మాస్ట‌ర్ స‌హా చిత్ర‌యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

More News

రాజ్ తరుణ్ దర్శకత్వం?

రాజ్ తరుణ్ కి దర్శకత్వం చేయాలన్నది కల.అందుకే దర్శకత్వ శాఖలో పనిచేశారు.అనూహ్యంగా ఉయ్యాల జంపాలా సినిమాతో హీరోగా టర్న్ అయిన రాజ్ తరుణ్ అప్పుడే మూడు హిట్లను ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

'ఎక్స్ ప్రెస్ రాజా 'ఆడియో డేట్

ఎక్స్ ప్రెస్ రాజా ఆడియో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.డిసెంబర్ 19న హైదరాబాద్ లో ఈ వేడుక జరగనుంది.మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

'అందమైన మాయ' డిసెంబర్ 19న విడుదల

విశ్వ శ్రీ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకం పై మణింద్రన్ దర్శకత్వం లో కొట్టే నాగరాజు యాదవ్ నిర్మాతగా కార్తీక్, భవ్య శ్రీ,హేమంత్ ,ఝాన్సీ మరియు శ్రుతిజ ముఖ్య పాత్రలలో నిర్మించిన చిత్రం అందమైన మాయ.

హ్యాపీ బర్త్ డే టు రెజీనా

యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన ఎస్.ఎం.ఎస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల నాయిక రెజీనా.

హ్యాపీ బర్త్ డే టు విక్టరీ వెంకటేష్...

క్లాస్..అయినా,మాస్ అయినా,ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోయి...ఆ పాత్రకే వన్నె తెచ్చే కథానాయకుడు విక్టరీ వెంకటేష్.