Nagababu:నా మాటలకు ఎవరైనా నొచ్చుకుంటే క్షమించండి: నాగబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ వాలెంటైన్’(Operation Valentine) ప్రీరిలీజ్ ఈవెంట్లో తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. అసలు ఏం జరిగిందంటే ఆయన కుమారుడు వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా నటించిన ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్లో గ్రాండ్ జరిగింది. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ "పోలీస్ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్ అంటే చూడటానికి హైట్, వెయిట్, మంచి ఫిజిక్ తో ఉండాలి. వరుణ్ దానికి బాగా సెట్ అయ్యాడు. తను 6 అడుగుల మూడు అంగుళాలు ఉన్నాడు కాబట్టి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇలాంటి పాత్రలు 5 అడుగుల మూడు అంగుళాల వ్యక్తులు చేస్తే సెట్ అవ్వదు" అని తెలిపారు. అయితే తమ హీరో గురించే నాగబాబు ఈ వ్యా్ఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై నాగబాబు తాజాగా స్పందిస్తూ "ఇటీవల జరిగిన వరుణ్ బాబు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను. ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను, ఎవరైనా ఆ మాటలకి నొచ్చుకునుంటే I’m Really Very sorry, అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని కావాలని అన్న మాటలు కాదు. అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను" అంటూ పోస్ట్ చేశారు. మరి నాగబాబు క్షమాపణలతో ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడినట్లేనని క్రిటిక్స్ చెబుతున్నారు.
కాగా పుల్వామా ఘటన నేపథ్యంలో శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ‘ఆపరేషన్ వాలంటైన్’ తెరకెక్కింది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాలో మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించగా.. రుహానీ శర్మ, నవదీప్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 1న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇదిలా ఉంటే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న నాగబాబు ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఇటీవల జరిగిన వరుణ్ బాబు 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను,ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను,ఎవరైన ఆ మాటలకి… pic.twitter.com/Ppr44YcqI8
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 29, 2024
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments