Nagababu:నా మాటలకు ఎవరైనా నొచ్చుకుంటే క్షమించండి: నాగబాబు

  • IndiaGlitz, [Thursday,February 29 2024]

మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) ఇటీవల జరిగిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’(Operation Valentine) ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. అసలు ఏం జరిగిందంటే ఆయన కుమారుడు వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా నటించిన ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్‌లో గ్రాండ్‌ జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పోలీస్ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్ అంటే చూడటానికి హైట్, వెయిట్, మంచి ఫిజిక్ తో ఉండాలి. వరుణ్ దానికి బాగా సెట్ అయ్యాడు. తను 6 అడుగుల మూడు అంగుళాలు ఉన్నాడు కాబట్టి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇలాంటి పాత్రలు 5 అడుగుల మూడు అంగుళాల వ్యక్తులు చేస్తే సెట్ అవ్వదు అని తెలిపారు. అయితే తమ హీరో గురించే నాగబాబు ఈ వ్యా్‌ఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై నాగబాబు తాజాగా స్పందిస్తూ ఇటీవల జరిగిన వరుణ్ బాబు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్‌ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను. ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను, ఎవరైనా ఆ మాటలకి నొచ్చుకునుంటే I’m Really Very sorry, అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని కావాలని అన్న మాటలు కాదు. అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు. మరి నాగబాబు క్షమాపణలతో ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడినట్లేనని క్రిటిక్స్ చెబుతున్నారు.

కాగా పుల్వామా ఘటన నేపథ్యంలో శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ‘ఆపరేషన్ వాలంటైన్’ తెరకెక్కింది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాలో మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా నటించగా.. రుహానీ శర్మ, నవదీప్‌, తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 1న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న నాగబాబు ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన సోదరుడు పవన్ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే.

More News

YSRCP: ఏపీలో వైసీపీ సునామీ మరోసారి ఖాయం.. ప్రముఖ సర్వేలో వెల్లడి..

అధికార పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలైన తెలుగుదేశం-జనసేనలు కూటమిగా సిద్ధమయ్యాయి. బీజేపీ కూటమిలో చేరుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

YCP:వైసీపీలో చేరిన ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌.. అక్కడి నుంచి పోటీ..!

సీనియర్ ఐఏఎస్ అధికారి ఎండి.ఇంతియాజ్ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Ranveer Deepika:పెళ్లి అయిన ఆరేళ్లకు.. గుడ్ న్యూస్ చెప్పిన రణ్‌వీర్-దీపికా..

గత కొంతకాలంగా బాలీవుడ్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొణె తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది.

DSC:నిరుద్యోగులకు శుభవార్త.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ(Mega DSC) నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Mudragada and Jogaiah:పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ, జోగయ్య.. మీకో దండం అంటూ లేఖలు..

తాడేపల్లిగూడెం సభలో టీడీపీ-జనసేన సంయుక్తంగా నిర్వహించిన జెండా సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.