ఆంధ్ర, తెలంగాణ అనే భేదం లేదు.. జరిగిన తప్పుకు క్షమించండి: హైపర్ ఆది
Send us your feedback to audioarticles@vaarta.com
బుల్లితెర హాస్య నటుడు హైపర్ ఆది తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ప్రముఖ టివి ఛానల్ లో ప్రసారమయ్యే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే కార్యక్రమంలో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా కొన్ని డైలాగులు ఉన్నాయని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
హైపర్ ఆది, స్క్రిప్ట్ రైటర్, మల్లెమాల సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో కొలుచుకునే బతుకమ్మ, గౌరమ్మలని అగౌరవపరిచే విధంగా డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పారని ఫిర్యాదులో ఉంది. దీనితో హైపర్ ఆదిపై పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి.
ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆది స్వయంగా ముందుకు వచ్చాడు. ఓ వీడియో బైట్ ద్వారా బహిరంగంగా క్షమాపణ కోరాడు. ' ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు మా షోలో ఉండవు. తామంతా కలసి సంతోషంగా పని చేసుకుంటాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరం కలసి పరిష్కరించుకుంటాం. అన్ని ప్రాంతాల వారి ప్రేమ, అభిమానాలు ఉంటేనే తాము ప్రజలని ఎంటర్టైన్ చేయగలుగుతున్నాం.
శ్రీదేవి డ్రామా కంపెనీలో గౌరమ్మ, బతుకమ్మ లను ఉద్దేశించి నాపై ఆరోపణలు వస్తున్నాయి. అవేమీ తాము వాంటెండ్ గా చేసినవి కాదు. ఆ షోలో జరిగిన తప్పుకు నా తరుపున, ఆరోజు స్టేజిపై ఉన్న మా వాళ్ళ తరుపున క్షమాపణ కోరుతున్నా' అని హైపర్ ఆది తెలిపాడు.
జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో హైపర్ ఆది తన కామెడీ పంచ్ లతో నవ్విస్తున్న సంగతి తెలిసిందే. అవకాశం దక్కినప్పుడు వెండితెరపై కూడా మెరుస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout