పాపం...నయనతార
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి.. వరుస విజయాలు సాధించి.. తన అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంటున్న అందాల తార నయనతార. రీల్ లైఫ్ లో సక్సెస్ సాధించిన నయనతార రియల్ లైఫ్ లో మాత్రం సక్సెస్ కాలేకపోతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే...2006 లో నయనతార శింబుతో ప్రేమ ప్రయాణం... వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం.. ఇది కోలీవుడ్ లో ఓ సంచలనం.
అయితే..ఊహించని విధంగా శింబుతో ప్రేమ విఫలం అయ్యింది.దీంతో నయనతార తమిళ చిత్రాలకు దూరమై..తెలుగు చిత్రాలకు దగ్గరైంది. ఈ సమయంలోనే నయనతారకు ప్రభుదేవాతో పరిచయం కావడం...ఆ పరిచయం ప్రేమగా మారడం తెలిసిందే. శింబు లాగే ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం కూడా పెళ్లి వరకు వెళ్లింది. ఇంకేముంది ప్రభుదేవా - నయనతార పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం. అయితే...రెండోసారి కూడా నయనతార ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది.
దీంతో నయనతార ఆలోచనలోపడి సినిమాలకు దూరమైంది.ఆఖరికి ఈ వ్యవహారం నుంచి బయటపడి సినిమాల పై దృష్టి పెట్టింది. వరుస విజయాలు సాధిస్తూ నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంటుంది. రెండుసార్లు ప్రేమలో విఫలమైన నయనతార ఇక ప్రేమలో పడదేమో అనుకున్నారు. కానీ...ముచ్చటగా మూడోసారి నయనతార ప్రేమలో పడింది. ఈసారి డైరెక్టర్ విఘ్నేశ్ శశితో ప్రేమలో పడింది. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. వీరిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారని కూడా ప్రచారం జరిగింది.అయితే...వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో నయనతార, విఘ్నేశ్ విడిపోయారని తాజా సమాచారం. రీల్ లైఫ్ లో మహారాణిలా వెలిగిపోతున్న నయనతారకు రియల్ లైఫ్ లో మాత్రం కాలం కలిసి రావడం లేదు... ప్రేమ సఫలం కావడం లేదు. పాపం...నయనతార.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout