పాపం..లావణ్య
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల రాక్షసితో హీరోయిన్గా పరిచయమైన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా అవకాశాలను అందిపుచ్చుకుంటూనే ఉంది. సీనియర్ హీరో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సహా యువ హీరోలందరితో జత కడుతుంది. అయితే 2017వ సంవత్సరం లావణ్య త్రిపాఠికి అస్సలు అచ్చి రావడం లేదు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించిన మూడు చిత్రాలు తెరపైకి వచ్చాయి. మార్చి నెలలో శర్వానంద్‌కి జోడీగా నటించిన రాధ, ఏప్రిల్ నెలలో వరుణ్‌తేజ్‌కి జంటగా నటించిన మిస్టర్.. తాజాగా నిన్న విడుదలైన యుద్ధం శరణం (నాగచైతన్య కథానాయకుడు).. ఇలా ఈ అమ్మడు నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
దీంతో ఒకే ఏడాదిలో ఫ్లాప్‌ల హ్యాట్రిక్ చవిచూసినట్లయ్యింది లావణ్యకి. మొదటి రెండు సినిమాల్లో మరో హీరోయిన్‌తో కలిసి నటించిన లావణ్య.. యుద్ధం శరణంలో మాత్రం సోలో హీరోయిన్గా నటించింది. ఈ అమ్మడు నటించిన ప్రాజెక్ట్ z ఈ నెల 15న రానుంది. కనీసం.. ఈ సినిమా అయినా విజయం సాధిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com