ఏపీలో త్వరలో తెరుచుకోనున్న ప్రధాన దేవాలయాలు

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నది. ఇప్పటి వరకూ 3.0 లాక్‌డౌన్లు పూర్తి కాగా రేపో ఎల్లుండో మరోసారి పొడిగింపు ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కొన్ని సడలింపులు ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన దేవాలయాలు మూసివేయబడ్డ సంగతి తెలిసిందే. అయితే.. త్వరలోనే ఏపీలోని ప్రధాన దేవాలయాలు తెరుచుకునే విధంగా చర్యలు తీసుకుంటోంది జగన్ సర్కార్. ఈ మేరకు శుక్రవారం రాత్రి దేవాలయాలు తెరిచిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను దేవాదాయశాఖ విడుదల చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఈవోలకి ఆదేశాలు వెళ్లాయి.

మార్గదర్శకాలు..

- ఆలయానికి వచ్చే భక్తులు ఎక్కువగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునేలా చూడాలి
- భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకునేలా చూడాలి
- ఆన్‌లైన్‌లోనే దర్శనానికి సంబందించిన టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలి
- డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్‌తో పాటు శానిటైజ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి
- ఎప్పటికప్పుడు గుడి పరిసరాలు, క్యూ లైన్‌లు సోడియం హైపో క్లోరైడ్‌తో స్ప్రే చేయాలి
- ప్రతి దేవాలయంలోని ఇవన్నీ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి లేనిచో తగు చర్యలు ఉంటాయ్..

దుర్గమ్మను దర్శించుకోవాలంటే..

ఇదిలా ఉంటే.. విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారి దర్శనానికి అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. దుర్గమ్మ దర్శనం ఎప్పుడెప్పుడా అని భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ఆలయానికి భక్తులు దర్శనానికి వచ్చే సమయంలో కచ్చితంగా నియమనిబంధనలు పాటించాలని

- అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి
- ఎస్ఎమ్మెస్ ద్వారా టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలి
- 24 గంటల ముందుగానే స్లాట్ బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు
- ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతి
- గంటకు 250 మంది భక్తులకు మించకుండా దర్శనం కలిగించేలా అధికారులు చర్యలు
- ఆధార్ నెంబర్‌తో సహా దర్శన సమయాన్ని ఎస్ఎమ్మెస్‌లలో భక్తులకు సమాచారం
- అంతరాలయ దర్శనం, శఠగోపం, తీర్థం పంపిణి నిలిపి వేస్తూ అధికారుల ఏర్పాట్లు చేశారు..

శ్రీవారి ఆలయం సంగతేంటి..!?

కాగా.. ప్రధాన ఆలయాలంటే ప్రతి జిల్లాలో నాలుగైదు ఉన్నాయ్. అయితే ప్రభుత్వం మాత్రం కచ్చితంగా ఫలానా దేవాలయాలే అని మాత్రం చెప్పలేదు. త్వరలో తెరుచుకోనున్నాయ్ అని చెప్పింది గనుక ఇందుకు సంబంధించి ఏమైనా జాబితాలు ప్రకటించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధి కూడా ఈ జాబితాలో కచ్చితంగా ఉంటుందని శ్రీవారి భక్తులు వేచి చూస్తున్నారు. వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తుడికి రాష్ట్రంలో మొదట కరోనా పాజిటివ్ వచ్చిన విషయం విదితమే.! మరి దేవాదాయ శాఖ జాబితాలో ఏయే ఆలయాలు ఉంటాయో తెలియాలంటే జాబితా వచ్చేవరకూ వేచి చూడాల్సిందే.

More News

థియేటర్లకు ఆదాయం పెరిగే ఐడియా ఇచ్చిన నాగ్ అశ్విన్!

సావిత్రి బయోపిక్ ‘మహానటి’ చిత్రంతో స్టార్ హోదా అందుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో ఆయన పేరు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు

రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..

భారతదేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజి ప్రకటించిన కేంద్రం..

డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య

అన‌సూయ‌ను అభినందించిన పోలీసులు

జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగామ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు నేడు(మే 15). ఈ సంద‌ర్భంగా అన‌సూయ కీస‌ర మండ‌లంలోని ప‌లువురు గ‌ర్భిణీల‌కు న్యూటిష‌న్ కిట్ల‌ను పంపిణీ చేశారు.

బాలీవుడ్ విల‌న్‌తో బాల‌కృష్ణ‌..?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం