త్వరలోనే దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా..: కేంద్ర మంత్రి
- IndiaGlitz, [Wednesday,May 06 2020]
భారతదేశ వ్యాప్తంగా త్వరలోనే ప్రజా రవాణా ఉంటుందని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరి స్పష్టం చేశారు. బుధవారం నాడు ఆయన.. దేశంలోని బస్సు, కార్ల ఆపరేటర్లతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒకింత శుభవార్తే చెప్పారు. కొన్ని కీలక మార్గదర్శకాలతో కూడిన ప్రకటన చేస్తామని.. కొద్ది రోజుల్లోనే రవాణా తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రజా రవాణాను పున: ప్రారంభించడం ద్వారా ప్రజల్లో తిరిగి ఉత్సాహం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే.. త్వరలోనే కొన్ని మార్గదర్శకాలతో ప్రజా రవాణాకు అనుమతినిస్తామని గడ్కరీ పేర్కొన్నారు. బస్సులు, కార్లు నడిపే సమయంలో మాత్రం కచ్చితంగా మాస్కులు ధరించడం, శానిటైజర్స్ వాడటం, సామాజిక దూరం పాటించడం లాంటి నిబంధనలను కచ్చితంగా అన్ని భద్రతా చర్యలను అవలంబించాలని ఆయన హెచ్చరించారు.
కాగా.. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ 3.0ను మరోసారి పెంచారు. ఇది మే- 17 వరకు అమలులో ఉంది. ఈ తరుణంలో రైల్వే, విమాన సేవలు, ప్రజా రవాణా కూడా నిషేధిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటిచింది. అయితే.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు 100 శ్రామిక్ స్పెషల్ రైళ్లను కేంద్రం నడిపించింది. అయితే పాసింజర్ టికెట్.. బుకింగ్ టికెట్స్ అని ఛార్జీలు వసూలు చేయడంతో విమర్శలు వస్తున్నాయి. మరోవైపు గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న భారతీయులను కూడా వారి స్వగ్రామాలకు తరలించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అయితే వలస కార్మికులు తప్ప ఇతర పనుల మీద లాక్ డౌన్‌కు ముందు వచ్చి చిక్కుకుపోయిన వారికి మాత్రం ఎలాంటి అనుమతివ్వట్లేదు.