థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని సోనూసూద్ సంచలన నిర్ణయం

కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని ఎంత అల్లకల్లోలం చేస్తోందో తెలియనిది కాదు. ఈ నేపథ్యంలో భరోసా ఇచ్చి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన కేంద్రం రాష్ట్రాలే చూసుకోవాలని చేతులెత్తేసింది. రాష్ట్రాలు చూస్తే కేంద్రం ఎంతో కొంత ఆర్థిక సపోర్ట్ లేకుంటే చాలా కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో జనాలకు కనిపించే ఏకైక వ్యక్తి ప్రముఖ నటుడు సోనూసూద్. రోజుకు వేలల్లో రిక్వెస్ట్‌లు.. మెడిసిన్ కావాలని.. ఆక్సిజన్ కోసం.. ఆసుపత్రిలో బెడ్ కోసం ఆయనకు వెళుతున్నాయి. ప్రాంతీయ భేదం లేకుండా ఆయన కూడా అడిగిందే తడవుగా తన వంతు సాయం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. థర్డ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయంగా మారింది.

Also Read: కరోనా సంర‌క్ష‌ణా కేంద్రానికి అమితాబ్ భారీ విరాళం

సెకండ్ వేవ్ దెబ్బకి హాస్పిటల్సే కాదు శ్మశానాలు కూడా ఖాళీలేకుండా పోయాయి. మరి సెకండ్ వేవే ఇంత దారుణంగా ఉంటే.. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తే పరిస్థితి ఏంటి? ఊహిస్తుంటేనే భయంకరంగా ఉంది కదా. అందుకే థర్డ్ వేవ్ అంటూ వస్తే.. ఎదుర్కొవడానికి ప్రభుత్వాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా.. సోనూసూద్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సెకండ్ వేవ్‌లో ముఖ్యంగా ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. దీంతో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది గమనించిన సోనూసూద్ థర్డ్ వేవ్‌లో ఆక్సిజన్ పాత్ర మరింతగా ఉండే అవకాశం ఉందని భావించి.. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లను నెలకొల్పాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే ఫ్రాన్స్‌ నుంచి ఓ ప్లాంట్‌కి ఆర్డర్ చేశామని.. మరో 10-12 రోజులలో అక్కడ నుంచి ఆక్సిజన్ ప్లాంట్ రాబోతున్నట్లుగా సోనూసూద్ తెలిపారు. అలాగే ఇంకొన్ని దేశాల నుంచి.. ప్లాంట్‌లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా సోనూ ప్రకటించారు. ‘‘ప్రస్తుతం సమయం అనేది అతి పెద్ద సవాలుగా మారింది. ప్రతీది సమయానికి అందించేలా.. మా వంతుగా ఎంతగానో కృషి చేస్తున్నాము. ఇక మన ప్రాణాల్ని కాపాడుకోగలం..’’ అని సోనూసూద్ పేర్కొన్నారు. సోనూసూద్ నుంచి ఈ మెసేజ్ సోషల్ మీడియాలో కనిపించగానే నెటిజన్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఆపత్కాలంలో ఆయననొక దేవుడిగా కీర్తిస్తున్నారు.

More News

తెలుగు రాష్ట్రాల ప్రజల విషయంలో రైల్వే కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి దేశమంతా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరింత వేగంగా విస్తరిస్తోంది.

అమెరికాలో దిల్ రాజు దంపతుల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ

నిర్మాత దిల్ రాజు, వైఘా రెడ్డిని గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో నిజామాబాద్ జిల్లాలోని ఓ గుడిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా

కరోనా ఫస్ట్ వేవ్‌లో పెద్దగా సెలబ్రిటీలెవరూ కరోనా బారిన పడలేదు కానీ సెకండ్ వేవ్‌లో మాత్రం స్టార్ హీరోలంతా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

ఈటల, కొండా కలిసి కేసీఆర్ సీటుకు ఎసరు పెడతారా?

ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం జరిగిందో ఏమో కానీ కొండా మాత్రం స్పీడ్ పెంచేశారు.

కరోనా సంర‌క్ష‌ణా కేంద్రానికి అమితాబ్ భారీ విరాళం

భారత్‌ను కొవిడ్ సెకండ్ వేవ్ అల్లకల్లోలం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా సామాన్యులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలన్న తేడా లేకుండా అంతా కరోనా బారిన పడుతున్నారు.