థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని సోనూసూద్ సంచలన నిర్ణయం
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని ఎంత అల్లకల్లోలం చేస్తోందో తెలియనిది కాదు. ఈ నేపథ్యంలో భరోసా ఇచ్చి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన కేంద్రం రాష్ట్రాలే చూసుకోవాలని చేతులెత్తేసింది. రాష్ట్రాలు చూస్తే కేంద్రం ఎంతో కొంత ఆర్థిక సపోర్ట్ లేకుంటే చాలా కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో జనాలకు కనిపించే ఏకైక వ్యక్తి ప్రముఖ నటుడు సోనూసూద్. రోజుకు వేలల్లో రిక్వెస్ట్‌లు.. మెడిసిన్ కావాలని.. ఆక్సిజన్ కోసం.. ఆసుపత్రిలో బెడ్ కోసం ఆయనకు వెళుతున్నాయి. ప్రాంతీయ భేదం లేకుండా ఆయన కూడా అడిగిందే తడవుగా తన వంతు సాయం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. థర్డ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయంగా మారింది.
Also Read: కరోనా సంరక్షణా కేంద్రానికి అమితాబ్ భారీ విరాళం
సెకండ్ వేవ్ దెబ్బకి హాస్పిటల్సే కాదు శ్మశానాలు కూడా ఖాళీలేకుండా పోయాయి. మరి సెకండ్ వేవే ఇంత దారుణంగా ఉంటే.. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తే పరిస్థితి ఏంటి? ఊహిస్తుంటేనే భయంకరంగా ఉంది కదా. అందుకే థర్డ్ వేవ్ అంటూ వస్తే.. ఎదుర్కొవడానికి ప్రభుత్వాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా.. సోనూసూద్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సెకండ్ వేవ్‌లో ముఖ్యంగా ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. దీంతో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది గమనించిన సోనూసూద్ థర్డ్ వేవ్‌లో ఆక్సిజన్ పాత్ర మరింతగా ఉండే అవకాశం ఉందని భావించి.. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి ఓ ప్లాంట్‌కి ఆర్డర్ చేశామని.. మరో 10-12 రోజులలో అక్కడ నుంచి ఆక్సిజన్ ప్లాంట్ రాబోతున్నట్లుగా సోనూసూద్ తెలిపారు. అలాగే ఇంకొన్ని దేశాల నుంచి.. ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా సోనూ ప్రకటించారు. ‘‘ప్రస్తుతం సమయం అనేది అతి పెద్ద సవాలుగా మారింది. ప్రతీది సమయానికి అందించేలా.. మా వంతుగా ఎంతగానో కృషి చేస్తున్నాము. ఇక మన ప్రాణాల్ని కాపాడుకోగలం..’’ అని సోనూసూద్ పేర్కొన్నారు. సోనూసూద్ నుంచి ఈ మెసేజ్ సోషల్ మీడియాలో కనిపించగానే నెటిజన్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఆపత్కాలంలో ఆయననొక దేవుడిగా కీర్తిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout