రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకున్న విలన్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు ప్రముఖులు తమ వంతుగా సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. నిరుపేద, సినీ కార్మికులకు తమకు తోచినంత సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాల రూపంలోనూ డబ్బులిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే బాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు విరాళాలు ప్రకటించగా.. మరికొందరు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవడం.. ఇంకొందరు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఇలా చేస్తున్నారు.
హెల్త్ వర్కర్స్ కోసం హోటల్..
అయితే.. రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోషించే ప్రముఖ నటుడు సోనూసూద్ మాత్రం హెల్త్ వర్కర్స్ ఓ మంచి పనిచేసి రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకున్నాడు. ఆయన చేసిన పనికి నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు శభాష్ సోనూసూద్ అని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే.. నిత్యం కరోనాపై పోరాడుతున్న హెల్త్ వర్కర్స్ కోసం ప్రత్యేకంగా ముంబైలోని జుహు ప్రాంతంలో కొత్తగా ఓ హోటల్‌ను ఓపెన్ చేశాడు. వర్కర్స్ వచ్చి ఉచితంగా భోజనాలు చేసి వెళ్లొచ్చు.. ఒక్క పైసా కూడా బిల్ చెల్లించనక్కర్లేదు. ఇదీ సోనూసూద్ చేసిన మంచి మనసుతో చేసిన పని. నిజంగా విలన్ చేసిన పనికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సైతం మెచ్చుకుంటోంది.
గొప్ప మనసు..
కాగా.. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో.. మరోవైపు లాక్‌డౌన్ సందర్భంలోనూ డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా, పారిశుద్ధ కార్మికులు, జల మండలి, విద్యుత్ వంటి అత్యవసర సేవలు మాత్రం నిరంతరాయంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. వారిని చూసి ఏదో ఒక మంచి పనిచేయాలని భావించిన సోనూసూద్ ఇలా హోటల్ ప్రారంభించి గొప్ప మనసు చాటుకున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments