హైదరాబాద్‌లో సోనూసూద్ హల్చల్..!
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ సమయంలో రియల్ హీరోగా మారి ఎందరికో ఆదర్శంగా నిలిచిన బాలీవుడ్ నటుడు సోనూసూద్.. హైదరాబాద్‌లో సందడి చేశారు. తన పేరుతో ఫాస్ట్ఫుడ్సెంటర్ పెట్టుకున్న అభిమానిని కలుసుకుని ధన్యవాదాలు తెలిపారు. ఇంతకీ సదరు అభిమానిని ఎందుకు సోనూసూద్ కలుసుకున్నాడనే వివరాల్లోకి వెళితే.. అనిల్ అనే యువకుడు ఓ చైనీస్ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడు. కరోనా ఎఫెక్ట్‌తో ఆ రెస్టారెంట్‌ను అనిల్ ఆపేశాడు. కోవిడ్ సమయంలో సోనూసూద్ చేస్తున్న మంచి పనులు చూసిన అనిల్.. చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ స్థానంలో హైదరాబాదీ ఫుడ్ కోర్టును స్టార్ట్ చేశాడు. ఆ ఫుడ్ కోర్టుకి లక్ష్మీ సోనూసూద్ ఫుడ్ సెంటర్ పేరు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్, బేగంపేటలోని అనిల్ ఫుడ్ సెంటర్‌ను సందర్శించాడు. స్వయంగా ఎగ్ ఫ్రైడ్ రైజ్‌ను తయారు చేసుకుని తిన్నాడు. సోనూసూద్‌ను అనిల్ సత్కరించాడు.
తెలుగులో ప్రస్తుతం సోనూసూద్ రెండు సినిమాలు చేశాడు. అందులో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’తోపాటు బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఇకపై విలన్‌గా సినిమాలు చేయనని.. హీరోగానే సినిమాలు చేస్తానని రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments