పంజాబ్ ఎన్నికలు: పోలింగ్ బూత్‌లోకి వెళ్లే యత్నం.. సోనూసూద్ కారును సీజ్ చేసిన ఈసీ
Send us your feedback to audioarticles@vaarta.com
పంజాబ్ ఎన్నికల వేళ సినీనటుడు సోనూసూద్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఓటింగ్ జరుగుతుండగా పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సోనూసూద్‌ను అధికారులు అడ్డుకున్నారు. అంతేకాదు.. కారును సీజ్ చేసి ఆయన్ను తిరిగి ఇంటికి పంపించారు. ఇంటి నుంచి బయటకు వస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సోనూసూద్‌ను హెచ్చరించారు.
సోనూసూద్ సోదరి మాల్విక సూద్ మోగా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు సోనూసూద్ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అధికారులు ఆయనను అడ్డుకున్నారు. దీనిపై సోనూసూద్ స్పందిస్తూ.. పోలింగ్ కేంద్రాల్లో డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. అకాలీ దళ్‌కు నేతలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను బెదిరిస్తున్నారని సోనూసూద్ చెప్పారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడటం మన బాధ్యత అని అందుకోసమే వెళ్లానని, అధికారుల ఆదేశాల మేరకు ఇంట్లోనే వున్నామని ఆయన పేర్కొన్నారు.
అకాలీదళ్ అభ్యర్ధి బర్జిందర్ సింగ్ తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని.. ఇది కేవలం పార్కింగ్ సమస్య మాత్రమేనని సోనూసూద్ చెప్పారు. అటు సోనూసూద్ కారును సీజ్ చేసిన ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఆయన ఓటర్లను ప్రభావితం చేశారా అనే అంశంపై నివేదిక సమర్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com