పంజాబ్ ఎన్నికలు: పోలింగ్ బూత్‌లోకి వెళ్లే యత్నం.. సోనూసూద్‌ కారును సీజ్ చేసిన ఈసీ

  • IndiaGlitz, [Sunday,February 20 2022]

పంజాబ్ ఎన్నికల వేళ సినీనటుడు సోనూసూద్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఓటింగ్ జరుగుతుండగా పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సోనూసూద్‌ను అధికారులు అడ్డుకున్నారు. అంతేకాదు.. కారును సీజ్ చేసి ఆయన్ను తిరిగి ఇంటికి పంపించారు. ఇంటి నుంచి బయటకు వస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సోనూసూద్‌ను హెచ్చరించారు.

సోనూసూద్ సోదరి మాల్విక సూద్ మోగా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు సోనూసూద్ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అధికారులు ఆయనను అడ్డుకున్నారు. దీనిపై సోనూసూద్ స్పందిస్తూ.. పోలింగ్ కేంద్రాల్లో డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. అకాలీ దళ్‌కు నేతలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను బెదిరిస్తున్నారని సోనూసూద్ చెప్పారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడటం మన బాధ్యత అని అందుకోసమే వెళ్లానని, అధికారుల ఆదేశాల మేరకు ఇంట్లోనే వున్నామని ఆయన పేర్కొన్నారు.

అకాలీదళ్ అభ్యర్ధి బర్జిందర్ సింగ్ తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని.. ఇది కేవలం పార్కింగ్ సమస్య మాత్రమేనని సోనూసూద్ చెప్పారు. అటు సోనూసూద్ కారును సీజ్ చేసిన ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఆయన ఓటర్లను ప్రభావితం చేశారా అనే అంశంపై నివేదిక సమర్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.

More News

మార్చి 4న ప్రేక్షకుల ముందుకు సెబాస్టియన్ పీసీ 524.... హ్యాట్రిక్ హిట్‌పై కన్నేసిన కిరణ్ అబ్బవరం

వినూత్నమైన కథలతో దూసుకెళ్తున్నాడు యువ హీరో కిరణ్ అబ్బవరం.

‘‘లైంగిక వేధింపులకు గురయ్యా’’.. సూసైడ్ నోట్ రాసి ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య

హైదరాబాద్‌‌లో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మత్స్యకార అభ్యున్నతి సభ: రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో పవన్‌కు ఘనస్వాగతం

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరగనున్న మత్స్యకార అభ్యున్నతి సభకు హాజరయ్యేందుకు జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌

భీమ్లా నాయక్ ఎఫెక్ట్: శర్వానంద్ ‘‘ఆడవాళ్లు మీకు జోహార్లు’’ వాయిదా.. గనికి కూడా తప్పదా..?

శర్వానంద్‌, రష్మిక జంటగా తిరుమల కిషోర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ విడుదల వాయిదాపడింది.

బూతులు తిట్టి, దాడి చేశారు.. వారిపై చర్యలు తీసుకోండి: పోలీసులకు రైటర్ చిన్ని కృష్ణ ఫిర్యాదు

ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ పోలీసులను ఆశ్రయించడం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.