పెను ప్రమాదం నుంచి కోవిడ్ రోగులను రక్షించిన సోనూసూద్ బృందం
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రముఖ నటుడు సోనూసూద్ మరింత మందికి సాయం అందిస్తున్నారు. ఆయన సాయం పొందుతున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. సెలబ్రిటీలు సైతం తమకు మెడిసిన్, ఆక్సిజన్ వంటివి అవసరమైతే సోనూనే అర్థిస్తున్నారు. అడిగిన వెంటనే క్షణాల్లో వారికి అవసరమైన మందులు, ఆక్సిజన్, హాస్పిటల్‌లో బెడ్ వంటివి సోనూ అరేంజ్ చేస్తున్నారు. సూద్ ఫౌండేషన్ పేరుతో ఆయన అందిస్తున్న సేవ అంతా ఇంతా కాదు. ఆయనతో పాటు అతని ఎన్‌జీవో సభ్యులు కూడా చాకచక్యంగా వర్క్ చేస్తున్నారు.
Also Read: ‘లూసిఫర్’ అప్‌డేట్.. ఆయన తప్పుకోలేదట
ఇటీవల బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి (శ్రేయాస్ హాస్పిటల్) వద్ద ఆక్సిజన్ లీక్‌ను అక్కడి పోలీసుల బృందంతో కలిసి ఆసుపత్రి సిబ్బంది గుర్తించింది. ఆక్సిజన్ లీక్ విషయం తెలిసిన వెంటనే సోనూసూద్ బృందం తగినంత సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లతో ఆసుపత్రికి చేరుకుంది. దీంతో 30 మంది ప్రాణాలు నిలిచాయి. లీక్‌ను గుర్తించిన సమయంలో రోగులకు ఆక్సిజన్ సరఫరా గంట మాత్రమే మిగిలి ఉంది. ఆసుపత్రిలోని ఒక వైద్యుడు సమిత్ హవినల్ వెంటనే సంక్షోభం నుంచి బయటపడటానికి సోనూసూద్ ఫౌండేషన్, మేఘా చౌదరి, పోలీసు హెల్ప్‌లైన్ బృంద సభ్యులను సంప్రదించారు.
వెంటనే స్పందించిన సోనూసూద్ బృందం కొన్ని ఆక్సిజన్ సిలిండర్లతో ఆసుపత్రికి చేరుకుంది. అవి సరిపోవని భావించడంతో వెంటనే వారు సమీప ప్రాంతమైన పీన్యలోని ఇతర ఆసుపత్రులు, ఆక్సిజన్ ప్లాంట్లను సంప్రదించడం ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేయడానికి తమ వంతు కృషి చేశారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, రీమా సువర్ణ, ఆసుపత్రి యాజమాన్యం క్లిష్టమైన పరిస్థితుల్లో వెంటనే స్పందించినందుకు సోనూసూద్ బృందాన్ని ప్రశంసించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments