విమర్శించిన నెటిజన్‌కి సోనూ దిమ్మతిరిగే రిప్లై..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సమయంలో సోనూ సూద్ చేసిన సాయానికి ప్రజలు ఆయనను రియల్ హీరోగా తమ గుండెల్లో పెట్టుకున్నారు. అలాగే విమర్శించే నోళ్లూ లేకపోలేదు. ప్రతిదీ అనుమానపు దృష్టితో చూస్తూ సోనూసూద్‌ను తూలనాడే వాళ్లూ ఉన్నారు. అయితే సోనూ ఇటీవల ట్విట్టర్‌లో తమ ఆవేదన చెప్పుకున్న ఓ రోగికి సాయమందించేందుకు ముందుకు వచ్చారు. అదే తన తప్పైంది. ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ సోనూని విమర్శించాడు. దీంతో అతనికి నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు.
అసలు విషయంలోకి వెళితే.. కొత్త ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ వ్యక్తి తనకు సాయం చేయాలంటూ అర్థించాడు. అతనికి ఇద్దరు ముగ్గురు మాత్రమే ఫాలోవర్లున్నారు. అయితే అతను సోనూను ట్యాగ్ చేయలేదు. అయినా సోనూ ఆ ట్వీట్‌కి స్పందించి సాయమందించేందుకు ముందుకు వచ్చారు. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ.. కనీసం ఆ వ్యక్తి సోనూను ట్యాగ్ చేయకున్నా.. లొకేషన్.. కాంటాక్ట్ డీటైల్స.. మెయిల్ అడ్రస్ ఇవ్వకున్నా సోనూ రిప్లై ఇచ్చారు. ఇదెలా సాధ్యమో తెలియడం లేదని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అలాగే సహాయం కోరుతూ గతంలో చాలా ట్విటర్ హాండిల్స్ నుంచి వచ్చిన ట్వీట్లు ఇప్పుడు డిలీట్ అయిపోయాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
నెటిజన్ చేసిన విమర్శలపై సోనూసూద్ స్పందించారు. `అదే గొప్ప విషయం బ్రదర్. ఇబ్బందుల్లో ఉన్న వారిని నేను గుర్తిస్తా. అలాగే కష్టంలో ఉన్నవారు సైతం నన్ను ఆశ్రయిస్తారు. దానినే ఇన్‌టెన్షన్ అంటారు. అలాంటివి నీకు అర్థం కావు. రేపు పేషెంట్ ఎస్ఆర్‌సీసీ హాస్పిటల్‌లో ఉంటాడు. నీ వంతు సాయం నువ్వూ చెయ్యి. అతడికి కొన్ని పండ్లు పంపించు. ఎంతో మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ప్రేమకు ఆ ఇద్దరు ఫాలోవర్లు ఉన్న వ్యక్తి చాలా సంతోషిస్తాడు` అని రిప్లై ఇచ్చారు. ఆ రోగి వివరాలను కూడా సోనూ షేర్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments