మరో క్రికెటర్‌కు సోనూసూద్ సాయం..

  • IndiaGlitz, [Thursday,May 13 2021]

కరోనా మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రముఖ నటుడు సోనూసూద్ అందిస్తున్న సాయం మరువలేనిది. ఇక సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యాక ఆయన చేస్తున్న సాయం రెట్టింపయ్యింది. సూద్ ఫౌండేషన్‌ను నెలకొల్పి కష్టంలో ఉన్నామంటూ ఎవరైనా మెసేజ్ చేస్తే చాలు.. క్షణాల్లో వారి కష్టాన్ని తీర్చేస్తున్నారు. ఇప్పుడు కష్టంలో ఉన్నవారికి తమ రాష్ట్ర ప్రభుత్వమో లేదంటే కేంద్ర ప్రభుత్వమో గుర్తుకు రావడం లేదు.. సోనూసూద్ మాత్రమే గుర్తుకొస్తున్నారు. తాజాగా సెలబ్రిటీలు సైతం సాయం కోసం సోనూని ఆశ్రయిస్తున్నారు.

Also Read: పిల్లలపైనా క్లినికల్ ట్రయల్స్.. కోవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతి

తాజాగా మరో క్రికెటర్‌కు ఆయన సాయం అందించి తన గొప్పతనాన్ని నిరూపించుకున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు అడిగిన వెంటనే ఆయన సాయం అందించారు. దర్శకుడు మెహర్ రమేష్ ట్విటర్‌లో వెంకట రమణ అనే పేషెంట్ కోసం కొన్ని ఇంజక్షన్స్, మెడిసిన్స్ కావాలని కోరారు. కేవలం 24 గంటల్లో సోనూసూద్ మెడిసిన్స్ ను దర్శకుడికి అందజేశారు. ఇప్పటికే ఇటీవల మీరట్‌లోని తన ఆంటీకి అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాలని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభ్యర్థించగా.. నిమిషాల్లోనే అతనికి సోనూసూద్ సాయం అందించారు. తాజాగా మరో క్రికెటర్ సాయం కావాలంటూ సోనూకి ట్వీట్ చేశారు. అంతే క్షణాల్లో సాయం అందింది.

ఆ క్రికెటర్ మరెవరో కాదు. భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ . కర్ణాటకలో తనకు కావాల్సిన వ్యక్తికి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కావాలంటూ భజ్జీ చేసిన ట్వీట్‌కు సోనూ స్పందించాడు. అంతేకాదు.. అంతే వేగంగా ఆ ఇంజక్షన్లు అందజేశాడు. దీంతో సోనూ చేసిన సాయానికి భజ్జీ కృతజ్ఞతగా స్పందిస్తూ.. ‘కృతజ్ఞతలు సోదరా.. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి’ అని ట్వీట్‌ చేశాడు.

More News

పిల్లలపైనా క్లినికల్ ట్రయల్స్.. కోవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతి

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశీయ ఔషధ దిగ్గజం భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కోవాగ్జిన్ టీకాను చిన్నారులకు కూడా వేసేందుకు లైన్ క్లియర్ అయింది.

వేణ్నీళ్ల స్నానంతో కరోనా రాదా?

కరోనా మహమ్మారి ఎప్పుడైతే ప్రారంభమైతే అప్పటి నుంచి నివారణోపాయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపై మీటర్ రీడింగ్ మనమే తీసుకోవచ్చు..

టెక్నాలజీ డెవలప్ అయ్యాక మనం పెద్దగా బయటకు వెళ్లడం కానీ.. మన ఇంటికి ఒకరు రావడం కానీ తగ్గిపోయాయి.

'ఆర్ఆర్ఆర్' విజువల్ వండర్ వెండితెర పైనే చూడాలి, ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదు : ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడి ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే.

తెలంగాణలో కరోనా నియంత్రణలోనే ఉంది: కేటీఆర్

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరిస్థితి నియంత్రణలోనే ఉందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.