జాకీచాన్ చూసి చాలా నేర్చుకున్నాను - సోనూసూద్..!

  • IndiaGlitz, [Friday,January 27 2017]

కల్పన చిత్ర బ్యాన‌ర్ పై విజయవంతమైన చిత్రాలను అందించిన శ్రీమతి కోనేరు కల్పన హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో జాకీ చాన్‌ లేటెస్ట్‌ మూవీ 'కుంగ్‌ ఫూ యోగ' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రంలో సోనూసూద్‌, దిశ పటాని, అమైరా దస్తూర్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో ర‌చ‌యిత జె.కె.భార‌వి మాట్లాడుతూ...కుంగ్ ఫూ యోగ ఇండియ‌న్ మ్యాజిక్ అని చెప్ప‌చ్చు. జాకీచాన్ ఫైట్స్ ఎంత ఈజీగా చేస్తారో..డ్యాన్స్ కూడా అంతే ఈజీగా చేసారు. నాకు జాకీచాన్ అంటే అభిమానం. ఆయ‌న‌తో సినిమా చేయాల‌నేది కోరిక‌. క‌ల్ప‌న గారు జాకీచాన్ గారి సినిమాని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ నా కోరిక‌ను స‌గం తీర్చేసారు. కుంగ్ ఫూ యోగ ఖ‌చ్చితంగా బిగ్ హిట్ అవుతుంది అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ శైలీష్ మాట్లాడుతూ...క‌ల్ప‌న గారి బ్యాన‌ర్ తో అసోసియేట్ అయి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ఈ చిత్రంలోని యాక్ష‌న్ సీన్స్ ను ఆడియోన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. భారీ స్ధాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

నిర్మాత శివ కుమార్ మాట్లాడుతూ...ఇండియ‌న్ ఏక్ట‌ర్ సోనూసూద్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీలో న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న క‌ల్ప‌న గార్కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేస్తున్నాను అన్నారు.

నిర్మాత రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ...డైన‌మిక్ ప్రొడ్యూస‌ర్ క‌ల్ప‌న గారు త‌మిళ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు.ఇప్పుడు ఇంటర్నేష‌న‌ల్ మూవీని అందిస్తున్నారు. సోనూసూద్ అరుంధ‌తి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు. స్ట్రైయిట్ మూవీలా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్నారు.

నిర్మాత సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ...హాలీవుడ్లో జేమ్స్ బాండ్ సినిమాలు, డిస్నీవాల్డ్ సినిమాలు, జాకీచాన్ సినిమాలు బాగా చూస్తారు. జాకీచాన్ సినిమాలను పిల్ల‌లు, మాస్ ఆడియోన్స్ ఎక్కువుగా చూస్తారు. ఈ కుంగ్ ఫూ యోగ ఇండియ‌న్ మ‌సాల‌తో వ‌స్తుంది. ఈ చిత్రంలో న‌టించిన దిషా ను నేను హీరోయిన్ గా ప‌రిచ‌యం చేసాను. స్టార్ హీరోల సినిమాల్లో సాంగ్స్ వ‌లే ఈ చిత్రంలో పాట‌లు ఉన్నాయి. ఖ‌చ్చితంగా ఇండియాలో కుంగ్ ఫూ యోగ బిగ్ హిట్ గా నిలుస్తుంది అన్నారు.

అమైరా మాట్లాడుతూ...ఇండో - చైనా నేప‌ధ్యంలో జ‌రిగే క‌థ‌తో ఈ సినిమా రూపొందింది. టీమ్ అంతా చాలా హార్డ్ వ‌ర్క్ చేసాం. ప్ర‌తి ఒక్క‌రు ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు.

సోనూసూద్ మాట్లాడుతూ....నేను ఈరోజు జాకీచాన్ మూవీలో న‌టించే స్ధాయికి వ‌చ్చానంటే దానికి కార‌ణం నేను విభిన్న పాత్ర‌లు పోషించే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, ర‌చ‌యిత‌లు. అలాగే ప్రేక్ష‌కులు అంద‌రూ న‌న్ను ఆద‌రించ‌డం వ‌ల‌నే ఈ స్ధాయికి వ‌చ్చాను. రెండు రోజుల‌కు ఒక‌సారైనా హైద‌రాబాద్ వ‌చ్చేవాడిని. ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న హైద‌రాబాద్ ను మిస్ అయ్యాను. హైద‌రాబాద్ కి వ‌స్తే నా సొంత ఇంటికి వ‌చ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సంవ‌త్స‌రం ఖ‌చ్చితంగా రెండు లేక మూడు తెలుగు సినిమాలు చేస్తాను. అమైరాకు ఈ సినిమా త‌ర్వాత తెలుగులో కూడా అవ‌కాశాలు వ‌స్తాయి. జాకీచాన్ గురించి చెప్పాలంటే...లెజెండ్ అయిన‌ప్ప‌టికీ ఇంకా సినిమా కోసం హార్డ్ వ‌ర్క్ చేస్తుంటారు. ఏమాత్రం గ‌ర్వం లేకుండా ఉన్న ఆయ‌న్ని చూసి చాలా నేర్చుకున్నాను. డ్యాన్స్ చేయాలి అంటే చాలా ఎగ్జైట్ అయ్యారు. జాకీచాన్ యాక్ష‌న్ లో రిథ‌మ్ ఉంటుంది. ఈ చిత్రంలోని డిఫ‌రెంట్ ఫైట్స్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటాయి అన్నారు.