బిగ్ చీటింగ్.. బట్టబయలు చేసిన సోనూసూద్
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడిగా సోనూసూద్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కానీ తన వ్యక్తితంతో చాలామందికి ఆరాధ్య దైవంగా మారిపోయాడు సోనూసూద్. అభిమానులు సోనూసూద్ ని కలియుగ కర్ణుడిగా అభివర్ణిస్తున్నారు. దేశవ్యాప్తంగా సోనూ సూద్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.
కరోనా విపత్కర సమయంలో సోనూసూద్ అవసరమైన వారందరికీ సాయం చేస్తూవారి ప్రాణాలు కాపాడుతున్నాడు. దీనికోసం సోనూసూద్ ప్రత్యేకంగా తన టీం లనే రంగంలోకి దించాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా సోనూసూద్ పేరుతో కొందరు నీఛమైన పనులకు ఒడికట్టారు. ఈ ఘరానా మోసాన్ని సోనూసూద్ బయటపెట్టాడు.
ఇలాంటివారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంతకీ ఆమోసం ఏంటంటే.. సోనూ సూద్ ఫౌండేషన్ కు విరాళాలు ఇవ్వాలని కోరుతూ ఫోన్ పే అకౌంట్ ని ప్రచారం చేశారు. సందేహాల కోసం ఒక ఫోన్ నంబర్ కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు ఆ ప్రకటనలో ఉంది. విరాళాలు ఇవ్వాలనుకున్న వారు ఒక రూపాయి నుంచి ఎంతైనా ఇవ్వొచ్చని అందులో ఉంది. కొందరు మోసగాళ్లు డబ్బు వసూలు చేసేందుకు ఈ నకిలీ దందా ప్రారంభించారు.
అయితే సోనూ సూద్ వెంటనే స్పందించి అభిమానులని అప్రమత్తం చేశారు. 'వార్నింగ్.. ఇది ఫేక్ ఫౌండేషన్' అని సోనూసూద్ తేల్చేశాడు. కరోనా కష్టకాలంలో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. వారిని ఆదుకునేందుకు సోనూ సూద్ ప్రయత్నిస్తున్నారు. అలాంటి వ్యక్తి పేరు ఉపయోగించుకుని ఇలాంటి నీఛమైన పనులు కూడా చేస్తున్నారా అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
కరోనా ఇండియాలో ప్రారంభమైనప్పటి నుంచి సోనూసూద్ డబ్బుకు వెనుకాడకుండా ఎన్నో సహాయాలు అందించాడు. వలస కార్మికుల్ని ఇళ్లకు చేర్చేందుకు ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అత్యవసరమైన కరోనా రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నాడు.
?? WARNING ?? pic.twitter.com/ADnycHK0f2
— sonu sood (@SonuSood) May 17, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments