లిక్కర్ షాప్‌కు వెళ్లాలి సాయం చేయండని సోనూసూద్‌ను అడగ్గా..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు ప్రముఖులు తమ వంతుగా సాయం చేయడానికి ముందుకొచ్చిన విషయం విదితమే. ఇందులో భాగంగా.. రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోషించే ప్రముఖ నటుడు సోనూసూద్ మాత్రం మొదట 1500 పీపీఇ కిట్లు పంజాబ్‌లో డాక్టర్లందరికీ ఇవ్వడం.. ఆ తర్వాత ముంబైలోని తన హోటల్‌ను హెల్త్ కేర్ వర్కర్స్ ఇవ్వడం.. రంజాన్ మాసంలో వేలాది మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం లాంటి మంచి పనులు చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత వలస కార్మికులు వేల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నట్లు టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో చూసి చలించిన ఆయన.. వారికి నేనున్నా అంటూ అభయమిచ్చి ప్రత్యేక బస్సుల్లో మహారాష్ట్ర నుంచి గుల్బర్గా, కర్నాటక.. ఉత్తరప్రదేశ్ నుంచి లఖ్‌నవో, జార్ఖండ్, బీహార్‌తో పాటు మరికొందర్ని వారి స్వగ్రామాలకు తరలించారు. ఇన్నెన్ని మంచి పనులు చేసిన సోనూసూద్‌కు ఎవరైనా సెల్యూట్ కొట్టక మానరు.
అయితే.. తాజాగా నెటిజన్లతో సోనూసూద్ ముచ్చటించగా ఓ వీరాభిమాని కొంటె ప్రశ్న వేశాడు. అయితే దీన్ని ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోకుండా అంతే రీతిలో సోనూ కూడా రిప్లయ్ ఇచ్చారు. ఆయన రిప్లయ్ చూశాక సదరు అభిమాని నోరు మెదపలేదు. ప్రస్తుతం ఆ అభిమాని ప్రశ్న.. సోనూ రిప్లయ్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఇదీ జరిగింది..
అభిమాని : సోనూ భాయ్.. నేను మా ఇంట్లో ఇరుక్కుపోయాను. లిక్కర్ షాప్ వరకు వెళ్లేందుకు నాకు సాయం చేయండి
సోనూ సూద్ : భాయ్.. నువ్వు షాపు నుంచి తిరిగి వచ్చేందుకు నేను నీకు సహాయం చేయగలను. నీకు అవసరం అయితే నాతో చెప్పు అని సోనూ రిప్లయ్ ఇచ్చారు. వాస్తవానికి సోషల్ మీడియాలో ఆరి తేరిన ఈయన చాలా లాజిక్‌గా సమాధానాలు ఇస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే టైమింగ్‌ను బట్టి పంచ్ పేలుస్తుంటారు. కాగా.. ఇదే క్వశ్చన్ ఇంకెవర్నుంచి అయినా వచ్చుంటే ఇంకో హీరో అయితే ఎలా సమాధానం ఇచ్చేవారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com