ఇంకెన్ని రోజులు రైతులకు ఈ పరిస్థితి..: సోనూసూద్
Send us your feedback to audioarticles@vaarta.com
రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై పంజాబ్ రైతులు ప్రాణాలను సైతం లెక్కచేయక ఆందోళన నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ కొన్ని రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకూ ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. అయితే ఈ ఘటనపై నటుడు సోనూసూద్ స్పందించాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
తాజాగా దీనిపై సోనూసూద్ స్పందించారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'వి ది ఉమెన్'అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సోనూసూద్ రైతుల ఆందోళనలపై మాట్లాడుతూ ఈ విషయంలో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అని వాదించాలనుకోవడం లేదన్నారు. అయితే ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నానన్నారు. రైతులతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. తాను కూడా పంజాబ్‌లోనే పుట్టి పెరిగానన్నారు.
రైతులు చేస్తున్న ఈ పోరాటంలో భాగంగా కొందరు రైతులు ప్రాణాలను సైతం కోల్పోయారని సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల్లో పనిచేసుకుంటూ ఉండాల్సిన రైతులు .. వారి కుటుంబంతో కలిసి రోడ్లపై చలికి వణుకుతూ ఆందోళన కొనసాగిస్తున్నారన్నారు. ఇంకా ఎన్ని రోజులు రైతులకు ఈ పరిస్థితుల్లో ఉంటారో తెలియడం లేదని... ఈ దృశ్యాల్ని ఎప్పటికీ మరచిపోలేమని సోనూసూద్ పేర్కొన్నారు. ఇంతకు ముందు కూడా సోనూ.. ‘రైతులు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సమానం’ అని ట్వీట్ చేసి వారిపై తన అభిమానాన్ని చాటుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout