ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూసూద్ హామీ
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించాక ప్రముఖ నటుడు సోనూసూద్ ప్రజలకు అందిస్తున్న సాయం అంతా ఇంతా కాదు. ఇక సెకండ్ వేవ్ ప్రారంభమయ్యాక కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు సైతం సోనూసూద్ మాత్రమే గుర్తొస్తున్నారు. ఆయన కూడా అడిగిందే తడవుగా క్షణాల్లో వారికి సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా ఆయన సాయం చేసే పరిధి మరింత పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం సాయం అందించేందుకు సోనూ ముందుకు వచ్చారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికో కాదు.. ఏపీకి సాయం అందించేందుకు సోనూ ముందుకు రావడం విశేషం.
Also Read: స్విమ్ సూట్ లో పవన్ హీరోయిన్.. ఆమె అందాలకు వయసు అడ్డుకాదు
నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు... రూ.1.5 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సోనూసూద్ అంగీకరించినట్టు తెలుస్తోంది. నెల్లూరులో సోనూసూద్‌కు కొందరు మిత్రులు ఉన్నారు. జిల్లాకు ఏదైనా చేయాల్సిందిగా ఫోన్‌ద్వారా ఆయనను కోరగా.. సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. తమ జిల్లా వివరాలు.. అవసరాలు ఏంటో చెప్పాలని సోనూ అడిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోనూ స్నేహితులు ఆదివారం నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబును కలిశారు.
చక్రధర్‌బాబు చేత సోనూసూద్‌తో ఫోన్లో మాట్లాడించారు. జిల్లాలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చక్రధర్ చెప్పడంతో వెంటనే సోనూసూద్ అంగీకరించినట్లు సమాచారం. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సామగ్రి పంపుతానని, ఇందుకు అవసరమైన స్థలం సిద్ధం చేసుకోవాలని సోనూ చెప్పినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ సామగ్రి జిల్లాకు చేరుకోనున్నట్లు సమాచారం! అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ నెల్లూరు జిల్లాకు చెందిన అధికారులెవరూ స్పందించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments