Sonu Sood:రియల్ స్టార్‌కు నీరాజనం.. 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ చిత్రం, వీడియో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
సోనూసూద్... వెండితెరకు విలన్‌గానే తెలిసిన ఈ వ్యక్తి, అతని వ్యక్తిత్వం కోవిడ్ కష్టకాలంలో లోకానికి తెలిసింది. మానవసేవే మాధవ సేవ అన్న మాటను ఆచరణలో చూపుతూ... కష్టం అని తెలిసిన వెంటనే ఆదుకుంటూ వస్తున్నారు సోనూసూద్. కరోనా లాక్డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కూలీలను బస్సులు, విమానాల ద్వారా స్వస్థలాలకు చేర్చారాయన. ఆ తర్వాత సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు అందజేసి.. ఎంతోమంది ప్రాణాలు కాపాడారు సోనూ. ఈ చర్యలతో ఆయన రియల్ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో చోట్ల సోనూసూద్‌కు అభిమాన సంఘాలు కూడా వెలిశాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ కూడా ఆయన ఆపదలో వున్న వారికి సాయం చేస్తున్నారు.
ఎకరం స్థలంలో 2500 కేజీల బియ్యంతో అభిమానుల శ్రమ:
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సోనూసూద్ అభిమానులు ఆయనపై అభిమానం చాటుకున్నారు. దేవాస్‌లో వున్న తుకోజీరావు పవార్ స్టేడియంలో వున్న ఎకరం స్థలంలో 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ చిత్రాన్ని నేలపై ఆవిష్కరించారు. ఓ ప్లాస్టిక్ షేట్ను నేలపై పరిచి దానిపై బియ్యంతో ఆయన రూపాన్ని తీర్చిదిద్దారు. అంతేకాదు.. ఇందుకోసం వినియోగించిన బియ్యాన్ని ఓ అనాథాశ్రమానికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోనూసూద్ చేతిలో సినిమాలు:
ఇకపోతే.. సినిమాల విషయానికి వస్తే.. సోనూసూద్ ప్రస్తుతం ఫతేహా్ సినిమాలో నటిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అభినందన్ గుప్తా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం తర్వాత కిసాన్ చిత్రంలో నటించనున్నారు సోనూసూద్.
1 acre of land
— sonu sood (@SonuSood) April 12, 2023
2500 kgs of Rice for the needy.
And tons & tons of Pure love ❤️
Humbled beyond words.
@shubam81289781 pic.twitter.com/C6YRBnrAFV
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com