Sonu Sood:రియల్ స్టార్‌కు నీరాజనం.. 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ చిత్రం, వీడియో వైరల్

  • IndiaGlitz, [Thursday,April 13 2023]

సోనూసూద్... వెండితెరకు విలన్‌గానే తెలిసిన ఈ వ్యక్తి, అతని వ్యక్తిత్వం కోవిడ్ కష్టకాలంలో లోకానికి తెలిసింది. మానవసేవే మాధవ సేవ అన్న మాటను ఆచరణలో చూపుతూ... కష్టం అని తెలిసిన వెంటనే ఆదుకుంటూ వస్తున్నారు సోనూసూద్. కరోనా లాక్‌డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కూలీలను బస్సులు, విమానాల ద్వారా స్వస్థలాలకు చేర్చారాయన. ఆ తర్వాత సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు అందజేసి.. ఎంతోమంది ప్రాణాలు కాపాడారు సోనూ. ఈ చర్యలతో ఆయన రియల్ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో చోట్ల సోనూసూద్‌కు అభిమాన సంఘాలు కూడా వెలిశాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ కూడా ఆయన ఆపదలో వున్న వారికి సాయం చేస్తున్నారు.

ఎకరం స్థలంలో 2500 కేజీల బియ్యంతో అభిమానుల శ్రమ:

ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సోనూసూద్ అభిమానులు ఆయనపై అభిమానం చాటుకున్నారు. దేవాస్‌లో వున్న తుకోజీరావు పవార్ స్టేడియంలో వున్న ఎకరం స్థలంలో 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ చిత్రాన్ని నేలపై ఆవిష్కరించారు. ఓ ప్లాస్టిక్ షేట్‌ను నేలపై పరిచి దానిపై బియ్యంతో ఆయన రూపాన్ని తీర్చిదిద్దారు. అంతేకాదు.. ఇందుకోసం వినియోగించిన బియ్యాన్ని ఓ అనాథాశ్రమానికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోనూసూద్ చేతిలో సినిమాలు:

ఇకపోతే.. సినిమాల విషయానికి వస్తే.. సోనూసూద్ ప్రస్తుతం ఫతేహా్ సినిమాలో నటిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అభినందన్ గుప్తా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం తర్వాత కిసాన్ చిత్రంలో నటించనున్నారు సోనూసూద్.

More News

Sanjay Dutt:షూటింగ్‌లో బాంబ్ బ్లాస్ట్.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు గాయాలు, ఆసుపత్రికి తరలింపు

ఇటీవలి కాలంలో సినిమా షూటింగుల్లో పలువురు హీరోలు, హీరోయిన్లు ప్రమాదాల బారినపడిన సంగతి తెలిసిందే.

BRS Party:బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి : గుడిసెలపై పడ్డ బాణాసంచా, సిలిండర్ బ్లాస్ట్.. ఇద్దరి మృతి

ఖమ్మం జిల్లాలో  బుధవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటు చేసుకుంది.

Chiranjeevi:లగ్జరీ కారు కొన్న మెగాస్టార్.. ధర, ఫీచర్స్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. !!

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగారు.

Ram Charan:జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం.. చరణ్ పెట్ డాగ్‌ని చూశారా, ఫోటోలు వైరల్

మానవ నాగరికత ప్రారంభమైన నాటి నుంచి మనిషి జీవితంలో పెంపుడు జంతువులు ఒక భాగం.

MLC Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలుకు ఫ్రాక్చర్.. మూడు వారాల పాటు రెస్ట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గాయపడ్డారు.