సిద్దిపేటలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూసూద్ సిద్ధం.. అయితే..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ ఎన్ని కుటుంబాలను తుడిచిపెట్టేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత కారణంగానే చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాబట్టి ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ప్రముఖ నటుడు సోనూసూద్ ముందుకు వచ్చారు. ఇప్పటికే పలు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పేందుకు సోనూ రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో సైతం ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు నటుడు సోనూసూద్ ముందుకు వచ్చారు. సిద్దిపేటలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తానని సోనూ మాట ఇచ్చారు.
ఇదీ చదవండి: సుప్రీం హీరోతో ఉప్పెన బ్యూటీ.. మళ్ళీ సుకుమారే
ఈ క్రమంలోనే అనుమతి కోసం సోనూ ప్రతినిధులు.. మంత్రి హరీశ్రావును కలిశారు. సోనూసూద్ ప్రతిపాదనకు మంత్రి సైతం సానుకూలంగా స్పందించారు. దీంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా.. వీలైనంత మందికి ఆక్సిజన్ అందించేందుకు.. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ నుంచి సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్లాంట్లను వివిధ రాష్ట్రాల్లోని అవసరమైన ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు.
అయితే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. మొదటి రెండు ప్లాంట్లను ముందుగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. ఆ తర్వాత నెల్లూరులో ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులనుంచి అనుమతులు కూడా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత.. జూన్, జూలై మధ్య మరికొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు సోనూ తెలిపారు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ జాబితాలోనే తెలంగాణ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com