సాయం చేయడానికి ఆస్థులు తనఖా పెట్టిన సోనూసూద్
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ ముందు కేవలం నటుడిగానే అందరికీ సుపరిచితుడైన సోనూసూద్.. కోవిడ్ తర్వాత హీరో అయ్యాడు. కొన్ని వందల మందికి తన పరిధిని మించి సాయం చేశాడు. ఇప్పటికీ ఎంతో మంది సాయం కోసం సోనూసూద్‌ను కలుస్తూనే ఉన్నారు. ఆయన కూడా కాదనకుండా తోచిన సాయం చేస్తూనే ఉన్నాడు. అసలు సోనూసూద్‌కు ఇంత డబ్బు ఎలా వచ్చింది? అని అందరూ అనుకున్నారు. కానీ ఓ షాకింగ్ నిజం తెలిసింది.
అదేంటంటే..సాయం చేయడానికి సోనూసూద్ ముంబై జూహూలోని ఎనిమిది ఆస్థులను తాకట్టు పెట్టి లోన్ తెచ్చాడట. సెప్టెంబర్ 15న లోన్ పత్రాల్లో సంతకం పెట్టాడని, నవంబర్ 24న రిజిస్ట్రేషన్ కూడా చేశారని అంటున్నారు. దాదాపు పది కోట్ల రూపాయలు అప్పు తెచ్చి.. ఇప్పుడు ఆ మొత్తానికి సోనూసూద్ వడ్డీకడుతున్నాడట. ఈ వార్తలపై సోనూ మాత్రం స్పందించలేదు.
సోనూసూద్ కోవిడ్ ఎఫెక్ట్‌లో వేలాది మంది వలస కార్మికులను వారి ఊర్లకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అంతే కాకుండా ముంబైలో కొన్నివేల మందికి భోజన వసతిని కల్పించాడు. ఉద్యోగాలు అందించడంలో కీలక పాత్రను పోషించాడు. అప్పటి వరకు వెండితెరపై విలన్‌గా ఉన్న సోనూసూద్ ఈ చర్యలతో నేషనల్ హీరో అయ్యాడు. ఈయన ప్రజలకు అందించిన సేవలకుగానూ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ సోనూసూద్‌కు ఎస్‌డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డును అందించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout