పొలిటికల్ ఎంట్రీపై సోనూ సూద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రాజకీయాల్లోకి రావడం కోసమే సోనూ సూద్ సేవ చేస్తున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ లాక్‌డౌన్‌లో వలస కూలీలకు బస్‌లు ఎరేంజ్ చెయ్యడం, ఈ ఇయర్ కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలండర్లు మొదలుకుని రీసెంట్‌గా డెడ్ బాడీ ఫ్రీజర్లు ఇవ్వడం వరకు సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టాడు. ఇవన్నీ చూసిన ప్రజలు అతడిని లాక్‌డౌన్‌ మెసయ్య అంటున్నారు. గిట్టనివాళ్ళు రాజకీయాల్లోకి రావడం కోసమే ఇదంతా చేస్తున్నాడని విమరిస్తున్నారు. సోనూ సూద్ మనసులో ఏముంది? రాజకీయాల్లోకి వస్తాడా, రాడా? ఈ టాపిక్ మీద లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్‌కి కథ అక్కర్లేదు!

మంచి పనులు, ఇతరులకు సహాయం చేయడానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నాను. కానీ, ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూద్దాం. మనం అంచనా వేయలేం. రాబోయే రోజుల్లో నా జీవితం ఏ దారిలో వెళుతుందో అని సోనూ సూద్ అన్నారు. అలాగని, రాజకీయాల మీద నెగెటివ్ ఇంప్రెషన్ లేదన్నారు. ప్రస్తుతానికి పాలిటిక్స్ గురించి ఆలోచించడం లేదని, ప్రజలు కోరుకున్నట్టు జరుగుతుందేమో ఫ్యూచర్ చెబుతుందని సోనూ సూద్ అన్నారు సాధారణ మనిషిగా ఉన్నప్పుడు ఎంతో చేస్తుంటే, రాజకీయాల్లోకి వస్తే ఇంకా చేయొచ్చని చెప్పారు.

రాజకీయాలోకి వస్తానని గాని, రానని గాని సోనూ సూద్ చెప్పడం లేదు. రాజకీయాల్లో ఉంటే ఇంకా చేయొచ్చని అంటున్నారు. ఆ వెంటనే రాజకీయాల గురించి ఆలోచించడం లేదంటున్నారు. అతని అభిమానులు మాత్రం సోనూ సూద్ రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు.

More News

2డీజీ ఔషధం వినియోగానికి మార్గదర్శకాలను జారీ చేసిన డీసీజీఐ

క‌రోనాకు బ్రహ్మాస్త్రంలా పనిచేసే 2డీజీ ఔషధం ఇటీవలే అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. పొడి రూపంలో అందుబాటులోకి వ‌చ్చిన ఈ ఔష‌ధం.. ఒక మోస్తరు నుంచి తీవ్ర ల‌క్ష‌ణాలు ఉన్న క‌రోనా పేషెంట్ల‌కు

మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కరోనాతో మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్వీ ప్ర‌సాద్ మంగళవారం క‌న్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఎస్వీ ప్ర‌సాద్‌ కుటుంబానికి కరోనా సోకింది. దీంతో ఆయనతోపాటు ఆయన కుటుంబ

పాక్ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు విడుదల

పాకిస్తాన్‌లో భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు విడుదలయ్యాడు. ఇవాళ ప్రశాంత్ హైదరాబాద్ చేరుకోనున్నాడు. 2017 ఏప్రిల్ నెలలో ప్రశాంత్ అదృశ్యమయ్యాడు.

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ఢిల్లీ ప్రభుత్వం

ఛత్తీస్‌గఢ్ బాటలోనే ఢిల్లీ ప్రభుత్వం కూడా నడుస్తోంది. సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కరోనా కట్టడి నేపథ్యంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న

బాలకృష్ణకు నచ్చని కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో 'సింహాద్రి' సినిమాది స్పెషల్ ప్లేస్. అప్పటికి 'ఆది' లాంటి సక్సెస్ ఖాతాలో పడినా ఏదో వెలితి. దానికి ముందు 'సుబ్బు', తరువాత 'అల్లరి రాముడు', 'నాగ' ప్లాప్స్ ఎఫెక్ట్ ఉంది.