పొలిటికల్ ఎంట్రీపై సోనూ సూద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
రాజకీయాల్లోకి రావడం కోసమే సోనూ సూద్ సేవ చేస్తున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో వలస కూలీలకు బస్‌లు ఎరేంజ్ చెయ్యడం, ఈ ఇయర్ కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలండర్లు మొదలుకుని రీసెంట్గా డెడ్ బాడీ ఫ్రీజర్లు ఇవ్వడం వరకు సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టాడు. ఇవన్నీ చూసిన ప్రజలు అతడిని లాక్డౌన్ మెసయ్య అంటున్నారు. గిట్టనివాళ్ళు రాజకీయాల్లోకి రావడం కోసమే ఇదంతా చేస్తున్నాడని విమరిస్తున్నారు. సోనూ సూద్ మనసులో ఏముంది? రాజకీయాల్లోకి వస్తాడా, రాడా? ఈ టాపిక్ మీద లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇదీ చదవండి: "పవన్ కళ్యాణ్‌కి కథ అక్కర్లేదు!"
"మంచి పనులు, ఇతరులకు సహాయం చేయడానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నాను. కానీ, ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూద్దాం. మనం అంచనా వేయలేం. రాబోయే రోజుల్లో నా జీవితం ఏ దారిలో వెళుతుందో" అని సోనూ సూద్ అన్నారు. అలాగని, రాజకీయాల మీద నెగెటివ్ ఇంప్రెషన్ లేదన్నారు. ప్రస్తుతానికి పాలిటిక్స్ గురించి ఆలోచించడం లేదని, ప్రజలు కోరుకున్నట్టు జరుగుతుందేమో ఫ్యూచర్ చెబుతుందని సోనూ సూద్ అన్నారు సాధారణ మనిషిగా ఉన్నప్పుడు ఎంతో చేస్తుంటే, రాజకీయాల్లోకి వస్తే ఇంకా చేయొచ్చని చెప్పారు.
రాజకీయాలోకి వస్తానని గాని, రానని గాని సోనూ సూద్ చెప్పడం లేదు. రాజకీయాల్లో ఉంటే ఇంకా చేయొచ్చని అంటున్నారు. ఆ వెంటనే రాజకీయాల గురించి ఆలోచించడం లేదంటున్నారు. అతని అభిమానులు మాత్రం సోనూ సూద్ రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments