రియల్ స్టార్ సోనూసూద్‌కు అరుదైన గౌరవం.. ‘‘గోల్డెన్ వీసా’’ ఇచ్చిన దుబాయ్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సమయంలోనూ.. ఆ తర్వాత కూడా తన సామాజిక సేవతో ఎంతోమంది అవసరాలు తీర్చారు సోనూసూద్. రియల్ స్టార్‌గా పలువురి ప్రశంసలు పొందుతున్నారు. ఇప్పుడు ఆయనకు దేశవ్యాప్తంగా అభిమాన సంఘాలు కూడా వున్నాయి. అలాంటి సోనూసూద్‌కు అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్ ప్రభుత్వం ఆయనకు గోల్డెన్ వీసా జారీ చేసింది. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. గోల్డెన్ వీసా అందించిన దుబాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తాను అమితంగా ఇష్టపడే ప్రదేశాలలో దుబాయ్ కూడా ఒకటని సోనూసూద్ చెప్పారు. ఇక సినిమాల విషయానికి వస్తే కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆచార్యలో సోనూసూద్ నటించారు. అలాగే రోడీస్ కొత్త సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
భారతదేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మలయాళ నటుడు మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, నటి త్రిష, గాయని చిత్ర, కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సతీమణి ఉపాసనా ఇలా చాలా మంది గోల్డెన్ వీసా అందుకున్నారు.
ఈ గోల్డెన్ వీసాను యూఏఈ ప్రభుత్వం 2019 నుంచి జారీ చేస్తోంది. అయితే ఈ వీసాను అందరికీ ఇవ్వరు. సాహిత్యం, విద్య, కళలు, పరిశ్రమలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ వీసా అందజేస్తారు. దీని సాయంతో దుబాయ్లో ఎటువంటి ఆంక్షలు లేకుండా నివసించవచ్చు. స్థానికులకు ఎలాంటి హక్కులు ఉంటాయో అలాంటి హక్కులు ఈ గోల్డెన్ వీసా పొందిన వారికి కూడా ఉంటాయి. అంతేకాదు ఇక్కడ వ్యాపారం చేసుకొవడానికి కూడా వారికి అనుమతి ఉంటుంది. 5 నుంచి 10 ఏళ్ల వరకు దీని కాలపరిమితి ఉంటుంది. అనంతరం ఆటోమోటిక్గా రెన్యూవల్ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments