ఈ-రిక్షాలు పంపిణీ చేసిన సోనూసూద్
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్డౌన్ సమయంల నుంచి ప్రముఖ నటుడు సోనూసూద్ తన ప్రత్యేకతను చాటుతూనే ఉన్నాడు. దీంతో ఆయన దేశ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయిపోయారు. కష్టంలో ఉన్నామని ఎవరైనా సాయం కోరితే చాలు తక్షణమే వారికి సాయమందించి ఔరా అనిపించారు. తాజాగా సోనూసూద్ తన స్వస్థలమైన పంజాబ్‌లోని మోగా పట్టణంలో ఎనిమిది మంది నిరుద్యోగులకు ఈ-రిక్షాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరి మాళవిక సచార్, బావ గౌతమ్ సచార్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సోనూ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 150 ఈ-రిక్షాలు పంచాలని నిర్ణయించుకున్నానని, ఫలితంగా కొంతమందికైనా ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అవసరమైన వారికి తోచినంత సాయం చేయాలని కోరారు. తాను సేవా గుణాన్ని తన తల్లిదండ్రుల నుంచి అలవరుచుకున్నానని సోనూ తెలిపారు. తానేమీ దేవుడిని కానని.. అయితే అవసరమైన వారికి సాయమందిస్తూ తన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టు తెలిపారు.
రీల్ లైప్‌లో విలన్‌గా నటించే సోనూ.. రియల్ లైఫ్‌లో మాత్రం హరో అనిపించుకుంటున్నారు. వలస కూలీలకు సాయమందించి లాక్డౌన్లో హీరోగా మారిపోయిన సోనూ.. ఆ తర్వాత కూడా తన సేవాతత్పరతను చాటుతూనే ఉన్నాడు. ఇటీవల ‘ఆచార్య’ షూటింగ్లో కూడా పేదవారైన యూనిట్ సభ్యులకు స్మార్ట్ఫోన్లను గిఫ్ట్‌గా అందించిన విషయం తెలిసిందే. అందుకే ఈ విలన్‌కు నిజ జీవితంలో జనాలు గుడులు కట్టి మరీ పూజిస్తున్నారు.
.@SonuSood distributes e-rickshaws to the needy in his hometown of Moga, Punjab. The actor has pledged to distribute e-rickshaw across India to the one's in need so that they can be self reliant.#SonuSood #IndiaglitzTelugu pic.twitter.com/2aopGr5Egd
— IndiaGlitz.com™ (@igtelugu) February 13, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments