‘ఆచార్య’ సెట్లో ఆకట్టుకున్న సోనూసూద్.. 100 మందికి..
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఆచార్య’ షూటింగ్ సెట్లో ప్రముఖ నటుడు సోనూసూద్ ఆకట్టుకున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 100 మందికి సెల్ఫోన్లను బహుమతిగా ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. ‘ఆచార్య’ సినిమా కోసం పని చేస్తున్న నిరుపేదలైన 100 మందికి సోనూ స్మార్ట్ ఫోన్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. ‘ఆచార్య’లో సోనూ.. విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో భాగంగా హీరో మెగాస్టార్ చిరంజీవికి, సోనూకి మధ్య యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విషయమై సోనూ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఇకపై తాను విలన్‌గా నటించబోనని ఓ ఇంటర్వ్యూలో సోనూ వెల్లడించారు. ‘ఆచార్య’ షూటింగ్లో భాగంగా ఓ ఫైటింగ్ సన్నివేశంలో సోనూసూద్‌ని కొట్టడానికి మెగాస్టార్ చాలా ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోనూ స్వయంగా వెల్లడించారు. కోవిడ్ సమయంలో ఎంతో సేవ చేసి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నావని చిరు చెప్పారట. అంతేకాదు.. సోనూని కొడితే ప్రేక్షకులు తనపై కోపం పెంచుకునే అవకాశముందని చిరు ఫీల్ అయ్యారట. అంతే కాదు.. ఏ సినిమా షూటింగ్‌కి వెళ్లినా తనకు ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయని సోనూ వెల్లడించారు
అందువల్ల ఇకపై తాను విలన్‌గా చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సోనూ తెలిపారు. తనకు హీరోగా చాలా అవకాశాలు వస్తున్నాయని, ఇప్పటికే నాలుగు స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయని... నూతన సంవత్సరంలో హీరోగా కొత్త కెరీర్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టు సోనూ వెల్లడించారు. కాగా.. ‘ఆచార్య’ కోసం కోకాపేటలో వేసిన టెంపుల్ టౌన్ సెట్ ద్వారా ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. దీని నిర్మాణం 20 ఎకరాల్లో జరిగింది. మన దేశంలోనే ఒక సినిమా కోసం ఇన్ని ఎకరాల్లో సెట్ వేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments