సాయం కోరిన మెహర్ రమేష్.. 24 గంటల్లో అందించిన సోనూసూద్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రముఖ నటుడు సోనూసూద్ అందిస్తున్న సాయం మరువలేనిది. వలస కూలీలను తమ తమ ఇళ్లకు చేర్చి వారి కళ్లకు భగవంతుడిలా కనిపించారు. ఇక వేరే దేశంలో చిక్కుకు పోయిన వారిని సైతం స్వదేశానికి రప్పించి రియల్ హీరో అయిపోయారు. ఇక సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యాక ఆయన చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. సూద్ ఫౌండేషన్‌ను నెలకొల్పి కష్టంలో ఉన్నామంటూ ఎవరైనా మెసేజ్ చేస్తే చాలు.. క్షణాల్లో వారి కష్టాన్ని తీర్చేస్తున్నారు. ఇప్పుడు కష్టంలో ఉన్నవారికి తమ రాష్ట్ర ప్రభుత్వమో లేదంటే కేంద్ర ప్రభుత్వమో గుర్తుకు రావడం లేదు.. సోనూసూద్ మాత్రమే గుర్తుకొస్తున్నారు.
తాజాగా.. దర్శకుడు మెహర్ రమేష్ ట్విటర్లో వెంకట రమణ అనే పేషెంట్ కోసం కొన్ని ఇంజక్షన్స్, మెడిసిన్స్ కావాలని కోరారు. కేవలం 24 గంటల్లో సోనూసూద్ మెడిసిన్స్ ను దర్శకుడికి అందజేశారు. ఈ విషయాన్ని మెహర్ రమేష్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. సోనూసూద్ చేసిన సహాయానికి మెహర్ రమేష్ ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సోనూసూద్ పంపించిన మెడిసిన్‌ను సైతం మెహర్ రమేష్ ట్విటర్లో షేర్ చేశారు. సోనుసూద్ ప్రస్తుతం బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లతో పాటు అడిగిన వారికి మెడిసిన్‌ను సైతం అందిస్తూ కష్టంలో ఉన్నవారి పాలిట ఆపద్భాందవుడిలా మారారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments