అధ్యక్షురాలిగా కొనసాగలేనన్న సోనియా... లేఖపై రాహుల్ ఫైర్..

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న 48 మంది సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, అధిర్ రంజన్ చౌదరి, గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, మోతిలాల్ ఒరా, ముకుల్ వాస్నిక్, అంబికా సోని, ఏకే ఆంటోనీ, మల్లికార్జున ఖర్గే, చిదంబరం, ప్రియాంక గాంధీ, ఆనంద్ శర్మ తదితర సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకత్వ మార్పు, పార్టీ కేంద్ర కార్యాలయ మార్పు, క్షేత్ర స్థాయి నుంచి ఏఐసీసీ వరకు పార్టీ ప్రక్షాళన, సీనియర్ జూనియర్ల మధ్య సమన్వయం, క్షేత్ర స్థాయి నుంచి ఏఐసీసీ వరకు కమిటీల నియామకం తదితర అంశాలపై చర్చ జరగనుంది.

కాగా.. నాయకత్వ సంక్షోభం నేపథ్యంలో.. పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయమై ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో తనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని సోనియా గాంధీ కోరినట్టు సమాచారం. అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని సోనియా సూచించినట్టు తెలుస్తోంది. అయితే మాజీ ప్రధాని మాత్రం సోనియా గాంధీయే అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరుతున్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా మరికొంత కాలం కొనసాగాలని కోరినట్టు తెలుస్తోంది.

రాహుల్ ఫైర్..

రాహుల్ గాంధీ ఏ సమావేశం జరిగినా ప్రశాంతంగా ఉంటారు. కానీ నేటి సీడబ్ల్యూసీ సమావేశంలో మాత్రం తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ విరుచుకుపడినట్టు తెలుస్తోంది. సోనియా గాంధీ ఆరోగ్యం బాగోలేని సమయంలో ఇలా 23 మంది సీనియర్లు కూడబలుక్కుని లేఖ రాయడమేంటని ప్రశ్నించారు. మరోవైపు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయాలు క్లిష్టతరంగా ఉన్న సందర్భంలో ఆ లేఖను సోనియాకు ఎందుకు పంపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాగా.. లేఖ రాయడం దురదృష్టకరమని.. ఆ లేఖ హైకమాండ్‌ను, పార్టీని కూడా బలహీనపరుస్తుందని మాజీ ప్రధాని మన్మోహన్ కూడా అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

More News

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి కరోనా నెగిటివ్..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, సినీ ఇండస్ట్రీ చేసిన ప్రార్థనలు ఫలించాయి.

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. వారానికి 4 లక్షల చొప్పున పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దేశ వ్యాప్తంగా వైరస్ తీవ్రత భారీగా పెరిగిందన్నారు.

తెలంగాణలో కొత్తగా 1842 కేసులు..

రెండు రోజులుగా తెలంగాణలో కేసుల సంఖ్య 2 వేల మార్కును దాటివేయగా..

షూటింగ్‌కు సిద్దమవుతున్న ప్రభాస్.. సెప్టెంబర్ రెండో వారంలో స్టార్ట్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో స్టార్ట్ కాబోతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో

రేపు సీడబ్ల్యూసీ కీలక భేటీ.. సోనియా రాజీనామా?

కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా.. 2019లో తిరిగి ఆయన అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు.