Sonia Gandhi:మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయండి.. ప్రజలకు సోనియా గాంధీ సందేశం..

  • IndiaGlitz, [Tuesday,November 28 2023]

ఎన్నికల ప్రచారం చివరి రోజు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు వీడియో సందేశం పంపారు. నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా కానీ, మీరు నా మనసుకు చాలా దగ్గరగా ఉంటారు అన్నారు. తెలంగాణ ప్రజల ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. మీకు నిజమైన, నిజాయితీ గల ప్రభుత్వాన్ని, పాలనను అందించడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు. మార్పు కోసం కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాలని తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు విన్నవించుకుంటున్నానని పేర్కొన్నారు.

తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అయ్యేలా చూడాలనుకుంటున్నానని తెలిపారు. దొరల తెలంగాణని ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం అవ్వాలని ఆకాంక్షించారు. తనను సోనియమ్మ అని పిలిచి అపారమైన గౌరవం, అప్యాయత ఇచ్చారు. తల్లిలా చూసుకున్నారని.. ఈ ప్రేమ, గౌరవానికి తాను ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞుతగా ఉంటానని వెల్లడించారు. తెలంగాణలోని సోదరీమణులు, తల్లులు, కొడుకులు, కుమార్తెలు, సోదరులు ఈసారి మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయండని సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు.

More News

Rahul Gandhi:బీజేపీ ఏది చెబితే ఎంఐఎం అది చేస్తుంది: రాహుల్ గాంధీ

బీజేపీ చెప్పిన చోటే ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే అని.

Chandrababu Naidu: బెయిల్ రద్దుపై చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా జస్టిస్ బేలా ఎం త్రివేది

School Holidays:అలర్ట్: రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు

తెలంగాణ ఎన్నికల సందర్భంగా రేపు(నవంబర్‌ 29), ఎల్లుండి(నవంబర్ 30) హైదరాబాద్ నగరంలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

Kaushik Reddy:ఓడిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా: కౌశిక్ రెడ్డి

హుజురాబాద్‌ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

KCR:97 నియోజకవర్గాల్లో కేసీఆర్ సుడిగాలి పర్యటనలు.. నేటితో ముగింపు

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.