Sonia Gandhi:మార్పు కోసం కాంగ్రెస్కు ఓటు వేయండి.. ప్రజలకు సోనియా గాంధీ సందేశం..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల ప్రచారం చివరి రోజు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు వీడియో సందేశం పంపారు. నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా కానీ, మీరు నా మనసుకు చాలా దగ్గరగా ఉంటారు అన్నారు. తెలంగాణ ప్రజల ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. మీకు నిజమైన, నిజాయితీ గల ప్రభుత్వాన్ని, పాలనను అందించడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు విన్నవించుకుంటున్నానని పేర్కొన్నారు.
తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అయ్యేలా చూడాలనుకుంటున్నానని తెలిపారు. దొరల తెలంగాణని ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం అవ్వాలని ఆకాంక్షించారు. తనను సోనియమ్మ అని పిలిచి అపారమైన గౌరవం, అప్యాయత ఇచ్చారు. తల్లిలా చూసుకున్నారని.. ఈ ప్రేమ, గౌరవానికి తాను ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞుతగా ఉంటానని వెల్లడించారు. తెలంగాణలోని సోదరీమణులు, తల్లులు, కొడుకులు, కుమార్తెలు, సోదరులు ఈసారి మార్పు కోసం కాంగ్రెస్కు ఓటు వేయండని సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com