Sonia Gandhi :రూ.500కే గ్యాస్ సిలిండర్ , ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ .. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే రైతు, యూత్, దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ .. సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించింది. తాజాగా తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ప్రకటించారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం , చేయూత అనే గ్యారెంటీలను ఆమె ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అండగా నిలబడగాలని ఆమె కోరారు. తెలంగాణను తామే ఇచ్చామని, ఇకపై రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తామని సోనియా స్పష్టం చేశారు. ఈ గ్యారెంటీ స్కీంలు ప్రకటించడం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని సోనియా గాంధీ వెల్లడించారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే :
1. మహాలక్ష్మి
మహిళలకు ప్రతి నెల రూ.2,500..
రూ.500 కే గ్యాస్ సిలిండర్..
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
2. రైతు భరోసా
ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15,000..
వ్యవసాయ కూలీలకు రూ.12,000
వరి పంటకు రూ.500 బోనస్
3 గృహ జ్యోతి
ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
4. ఇందిరమ్మ ఇండ్లు
ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & రూ.5 లక్షలు..
ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం
5. యువ వికాసం
విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు..
ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషన్ స్కూల్స్
6. చేయూత
రూ.4,000 నెలవారీ పింఛను..
రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్య భీమా
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com