ఆ ప్రాజెక్ట్‌కి గుడ్‌బై చెప్పిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఈమధ్య బాలీవుడ్‌లో, టాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా ఎక్కుైవెందనే చెప్పాలి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఆమధ్య ఎయిర్ హోస్టెస్ నీర్జా బానోత్ జీవిత కథతో తెరకెక్కిన 'నీర్జా' సంచలన విజయం సాధించింది. ఆ చిత్రంలో టైటిల్ పాత్ర పోషించిన సోనమ్ కపూర్‌కి చాలా మంచి పేరు వచ్చింది. ఆమె కెరీర్‌లో ఓ వైుల్‌స్టోన్ మూవీగా నిలిచింది. ఈవుధ్య మరో బయోపిక్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రముఖ క్లాసికల్ డాన్సర్ అమృత షేర్‌గిల్ జీవిత కథతో ఆ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం షేర్‌గిల్ కుటుంబ సభ్యులను కూడా కలిసింది సోనమ్. అయితే ఉన్నట్టుండి ఆ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఆ పాత్రను తాను చేయులేనని చెప్పింది.
ఆ సినిమా కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్సి రావడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయుపడుతున్నాయి. ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించిన 'ప్యాడ్‌మ్యాన్' విడుదల కోసం ఎదురుచూస్తోంది సోనమ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments