మళ్లీ కెమెరా ముందుకు సోనాలి
- IndiaGlitz, [Monday,February 04 2019]
తెలుగులో 'మురారి', 'ఇంద్ర', 'పల్నాటి బ్రహ్మనాయుడు' వంటి చిత్రాల్లో నటించిన బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే.. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. న్యూయార్క్‌లో క్యాన్సర్ చికిత్స కూడా తీసుకుని రీసెంట్గా ముంబై చేరుకున్నారు.
క్యాన్సర్ కారణంగా ఇక సోనాలి సినిమాలకు దూరం అవుతుందేమో అనుకున్న వారికి న్యూస్ చెప్పారు. ఆమె.. ఓ షూటింగ్లో పాల్గొన్నారట. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు.
చాలా గ్యాప్ తర్వాత షూటింగ్‌కి రావడం కలలాగా ఉంది. కెమెరా ముందు నిలబడ్డప్పుడు ఆనందం మాటల్లో చెప్పలేనిది అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు సోనాలి బింద్రే.