చ‌నిపోతానని అనుకోలేదు - సోనాలీ బింద్రే

  • IndiaGlitz, [Wednesday,April 03 2019]

బాలీవుడ్ హీరోయిన్ సోనాలీ క్యాన‌ర్స్‌తో పోరాడుతున్నారు. గ‌త ఏడాది జూలైలో ఆమెకు కాన్స‌ర్ ఉన్న‌ట్లు తెలిసింది. న్యూయార్క్ వెళుతున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. కొన్ని నెల‌లు పాటు చికిత్స తీసుకున్నారు. ఆ చికిత్స తీసుకునే క్ర‌మంలో బాధ‌ప‌డ్డానేమో కానీ.. చ‌నిపోతాన‌ని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు సోనాలి.

ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ఆమె మాట్లాడుతూ నా ఉద‌ర భాగంలో క్యాన్స‌ర్ క‌ణాలున్నాయ‌ని, బ్ర‌తికే అవ‌కాశం 30 శాతం మాత్ర‌మేన‌ని డాక్ట‌ర్స్ చెప్పిన‌ప్పుడు మా గుండె ప‌గిలింది. కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలుసు. కానీ ఎప్పుడూ చ‌నిపోతాన‌ని అనుకోలేదు. క్యాన్స‌ర్‌తో నేను పోరాడే స‌మ‌యంలో నా కుటుంబ స‌భ్యులు అండ‌గా నిల‌బ‌డ్డారు.

ఇప్పుడు కొత్త ప్ర‌యాణాన్ని స్టార్ట్ చేశాను. నా శ‌రీరంపై ఎక్కువ దృష్టి పెడుతున్నాను. క్యాన‌ర్స్‌తో పోరాడే మ‌హిళ‌లు ఎక్కువ జాగ్ర‌త్త‌గా ఉండాలి. మీ చుట్టూ స్నేహితులు, కుటుంబ స‌భ్యులు ఉండేలా చూసుకోండి. ఇది ప్రేమ‌, అనురాగం పొందాల్సిన స‌మ‌యం'' అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు సోనాలీ బింద్రే.