ముంబైకి సోనాలి బింద్రే
- IndiaGlitz, [Monday,December 03 2018]
కొంత కాలంగా క్యాన్సర్‌తో ఇబ్బంది పోరాడుతున్న నటి సోనాలి బింద్రే న్యూయార్క్‌లో కీమోథెరపీ చికిత్స చేయించుకుంటున్నారు. ఆమె న్యూయార్స్‌లో ఉన్న సమయంలో సోషల్ మీడియా ద్వారా విషయాలను అందరికీ తెలియజేస్తూ వచ్చారు.
త్వరలోనే ఆమె ముంబై రానున్నాని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. నేను ఇంటికి వెళుతున్నాను. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నేను న్యూయార్క్ ఉన్నా నా మనసు ఎప్పుడూ నా కుటుంబ సభ్యులతోనే ఉంది. వారందరినీ తిరిగి కలవబోతున్నాను. యుద్ధం ముగిసిపోలేదు. ఇంటర్వెల్ కోసం ఎదురుచూస్తున్నాను. కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. జీవితంలో నేను చేసే సాహసాలు కొనసాగుతాయి అన్నారు.