సోనాలి షాక్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించిన సోనాలి బింద్రే తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. అలాగే తమిళ్‌లోనూ కొన్ని హిట్ సినిమాల్లో నటించి అందర్నీ మెప్పించిన సోనాలి బుధవారం ఒక షాకింగ్ న్యూస్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
తాను హై గ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, చికిత్స నిమిత్తం న్యూయార్క్ వెళుతున్నానని పోస్ట్ చేసింది. తాను ఓ యుద్దానికి సిద్ధమవుతున్నానని, తన కుటుంబం, స్నేహితులే తనకు బలమని తన పోస్ట్‌లో పేర్కొంది. 2002లో వివాహం చేసుకున్న తర్వాత 2004 నుంచి సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం హిందీ ఛానల్స్‌లో రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
— Sonali Bendre Behl (@iamsonalibendre) July 4, 2018
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com