సోనాల్ ముచ్చ‌ట తీరుతుందా?

  • IndiaGlitz, [Tuesday,October 20 2015]

'రెయిన్ బో' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. 'లెజెండ్' సినిమాతోనే తెలుగులో తొలి హిట్‌ని సొంతం చేసుకుంది సోనాల్ చౌహాన్‌. ఆ త‌రువాత 'పండ‌గ చేస్కో' తోనూ చెప్పుకోద‌గ్గ విజ‌యాన్ని మూట‌గట్టుకుంది. ఇక ఈ నెలాఖ‌రున క‌ళ్యాణ్ రామ్‌కి జ‌త‌గా 'షేర్' కోసం వెండితెర‌పై సంద‌డి చేయ‌నుంది ఈ సుంద‌రి.

ఈ నేప‌థ్యంలో 'షేర్' ఫ‌లితం సోనాల్‌కి ఎంతో ప్ర‌త్యేకంగా మారింది. ఎందుకంటే.. 'లెజెండ్‌, పండ‌గ చేస్కో' విజ‌యాలు సాధించినా.. ఆయా చిత్రాల్లో త‌న‌వి రెండో హీరోయిన్ పాత్ర‌లే. అదే 'షేర్' విష‌యానికి వ‌స్తే.. ఇది సోలో హీరోయిన్ చిత్రం. సో.. సోలో హీరోయిన్‌గా సోనాల్ కి మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కాలంటే.. 'షేర్ 'స‌క్సెస్ సాధించి తీరాల్సిందే. మ‌రి సోనాల్ ముచ్చ‌ట తీరుతుందా?