బాలయ్యతో మరోసారి చేస్తుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
సింహా`, లెజెండ్`, లయన్` వంటి వరుస విజయాలను సాధించిన బాక్సాఫీస్ బొనాంజా నటసింహ నందమూరి బాలకృష్ణ తన 99వ చిత్రం డిక్టేటర్`లో నటించడానికి సిద్ధమవుతున్నారు. లక్ష్యం`, రామ రామ కృష్ణ కృష్ణ`, పాండవులు పాండవులు తుమ్మెద`, లౌక్యం` వంటి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్‌తో అలరించిన వెర్సటైల్ డైరెక్టర్ శ్రీవాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇండియాలో టాప్‌మోస్ట్ ప్రొడక్షన్ హౌస్‌గా పేరొందిన ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాని బాలయ్య ఇప్పటివరకు చేసిన చిత్రాలకంటే స్టైలిష్‌గా, రిచ్‌గా ఉండేలా డైరెక్టర్ శ్రీవాస్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల డైరెక్టర్ శ్రీవాస్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు యూరోప్ వెళ్లి షూటింగ్ లొకేషన్స్‌ను పరిశీలించి వచ్చారు. ఇప్పటివరకు ఏ చిత్రమూ షూటింగ్ చేయనటువంటి లొకేషన్స్‌లో ఈ సినిమా సాంగ్స్, టాకీ, యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరించడానికి దర్శకుడు శ్రీవాస్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి హీరోయిన్గా నటిస్తోంది. అలాగే లెజెండ్`వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో సక్సెస్ఫుల్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న సోనాల్‌చౌహాన్ కూడా బాలయ్య సరసన మరో హీరోయిన్గా ఎంపికైంది. శ్రీవాస్ దర్శకత్వంలోపాటు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా నిర్వహిస్తుండడంతో సినిమా పట్ల చాలా కేర్ తీసుకుని సినిమాని స్టైలిష్‌గా, రిచ్‌గా, గ్రాండ్లెవల్లో రూపొందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments